Yogi Adityanath: ప్రార్థనా స్థలాల వద్ద మాంసం అమ్మకాలపై యోగి సర్కార్ నిషేధం
ప్రార్థనా స్థలాల వద్ద మాంసం అమ్మకాలపై యోగి సర్కార్ నిషేధం
Yogi Adityanath : నవరాత్రి పర్వదినాల్లో హిందూ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు ప్రార్థనా స్థలాల పరిసరాల్లో మాంసం, గుడ్లు అమ్మకాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు అక్రమ కబేళాలను పూర్తిగా మూసివేయాలని కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ఆదేశించారు. దీనితో రంగంలోనికి దిగిన అధికారులు రాష్ట్రంలోని 500 మతపరమైన ప్రదేశాల్లో మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 6న కబేళాలు మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై యూపీ మున్సిపల్ కార్పొరేష్ చట్టం, ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Yogi Adityanath Govt Comment
మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా నిషేధిత పదార్ధాల (మాంసం, గుడ్లు) అమ్మకాలు జరక్కుండా గట్టి నిఘా వేసేందుకు హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పోలీసు అధికారులు, కాలుష్య నివారణ బోర్డు అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, రవాణాశాఖ, కార్మిక శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఉంటారు. అక్రమ కబేళాల మూసివేత, మాంసం అమ్మకాల నిషేధంతో పాటు మతసామరస్యం పాదుకొలిపేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు యోగి సర్కార్ పలు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. చైత్ర నవారాత్రితో సహా పండుగల సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ఆదేశాలిచ్చింది. ఆలయాలు, ప్రార్థనా స్థలాల చుట్టూ పరిశుభ్రత కోసం ప్రత్యేక ప్రచారం సాగించాలని గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. పండుగల్లో భక్తుల రద్దీని నియంత్రించి ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా, ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
Also Read : Chhattisgarh: మరోసారి నెత్తురోడిన రెడ్ కారిడార్ ! 17 మంది మావోయిస్టుల మృతి !