IndiGo Flight: ఇండిగో విమానంలో బంగారం చోరీ ! సిబ్బందిపై అనుమానం !
ఇండిగో విమానంలో బంగారం చోరీ ! సిబ్బందిపై అనుమానం !
IndiGo Flight : తిరువనంతపురం – బెంగళూరు ఇండిగో విమానంలో ఐదేళ్ల బాలిక మెడలో బంగారు నెక్లెస్ చోరీకు గురయింది. దీనితో ఆ బాలిక తల్లి… విమానంలోని మహిళా సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో ఇండిగో విమానంలోని(IndiGo Flight) మహిళా సిబ్బంది దొంగతనం ఆరోపణలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
IndiGo Flight-Gold Theft
ప్రియాంక ముఖర్జీ అనే మహిళ కలకత్తా వెళ్లడం కోసం… తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని… ఏప్రిల్ 1న తిరువనంతపురం – బెంగళూరు ఇండిగో విమానం(IndiGo Flight) ఎక్కింది. అయితే ప్రయాణం మొదలైన కాపేటికే ప్రియాంక ఇద్దరు కుమార్తెలు గొడవపడటం మొదలు పెట్టారు. ఐదేళ్లు, రెండేళ్ల వయసున్న చిన్నారులు కావడంతో వారిని సమూదాయించడం ప్రియాంక వల్ల కాలేదు. చిన్నారుల గొడవ గమనించి క్యాబిన్ క్రూ మహిళా సిబ్బంది ఒకరు ప్రియాంక దగ్గరకు వచ్చి… తాను గొడవ సద్దుమణిగేలా చూస్తానని చెప్పింది. అందుకోసం ప్రియాంక పెద్ద కుమార్తె(5)ను తీసుకుని… విమానంలో ఓ పక్కకు వెళ్లి… ఆ చిన్నారిని సముదాయించింది. ఈలోపు ప్రియాంక చిన్న బిడ్డను ఊరుకోబెట్టింది. ఆతర్వాత ప్రియాంక పెద్ద కుమార్తె తల్లి దగ్గరకు వచ్చి కూర్చుంది. అనంతరం వారు బెంగళూరులో దిగారు.
అయితే ఆసయమంలో తన పెద్ద బిడ్డ మెడలో ఉండాల్సిన రెండు తులాల బంగారు నెక్లెస్ మాయం అయినట్లు ప్రియాంక గమనించింది. దీనితో ఆమె క్యాబిన్ క్రూ సిబ్బంది దగ్గరకు వెళ్లి నెక్లెస్ మిస్సింగ్ గురించి చెప్పి… వారిని ప్రశ్నించింది. అయితే వారు తమకేం తెలియదన్నారు. దీనితో ప్రియాంక ముఖర్జీ… కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ లో నెక్లెస్ గురించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై ఇండిగో యాజమాన్యం స్పందిస్తూ… మా ప్రయాణికులు ఒకరు తిరువనంతపురం నుంచి బెంగళూరు ప్రయాణిస్తున్న 6ఈ 661 విమాన సిబ్బందిపై బంగారం చోరిపై ఫిర్యాదు చేశారు. మేం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం… విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాము అని తెలిపారు.
Also Read : Indian Navy: పాక్ సిబ్బందికి సహాయం అందించిన ఇండియన్ నేవీ సిబ్బంది