Car Tragedy: రంగారెడ్డి జిల్లాలో విషాదం ! కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి !
రంగారెడ్డి జిల్లాలో విషాదం ! కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి !
Car Tragedy : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు పార్క్ చేసిన ఉన్న కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులు అక్క చెల్లెళ్ల పిల్లలు తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4)గా గుర్తించారు. అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఇంటి ముందు పార్క్ చేసిన కారులోకి వెళ్లారు. వీరు కారులోకి వెళ్లిన వెంటనే డోర్ లాక్ అవడంతో ఊపిరాడక అల్లాడిపోయారు. దీనిని గమనించిన వారి కుటుంబ సభ్యులు… హుటాహుటీన వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ… ఫలితం లేకపోయింది. దీనితో దామరగిద్డలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Car Tragedy Viral
తనయ శ్రీ, అభినయ శ్రీ అనే ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి రంగారెడ్డి(Rangareddy District) జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో బంధువుల వివాహానికి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. పెద్ద వాళ్లంతా ఇంట్లో ఉండగా చిన్నారులు ఆడుకుంటూ బయటకు వచ్చారు. వారు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులోకి(Car Tragedy) వెళ్లారు. అయితే, కారు డోర్లు లాక్ పడిపోయింది. దీనితో ఆ చిన్నారులు కార్ డోర్ తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అది రాలేదు. పెద్దవాళ్లను పిలిచేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ వీరి మాటలు బయటకు వినిపించలేదు. దీనితో కాసేపు కారులో ఊపిరి అందక ఇబ్బంది పడిన చిన్నారులు ఆ తరువాత ప్రాణాలు విడిచారు. అయితే చిన్నారులు కారులో వెళ్లి ఆడుకుంటున్న విషయాన్ని పెద్దలు మరిచిపోయారు.
కాసేపటి చిన్నారులు ఇంకా రాలేదని వారు వెళ్లి కారులో చూడగా అప్పటికే ఇద్దరు చిన్నారులు కూడా కారులో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే వారిని హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ ఇద్దరు చిన్నారులు శ్వాస తీసుకోలేక ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు. ఇద్దరు చిన్నారులు ఒకేసారి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా… అమ్మమ్మ ఇంటికి వచ్చి ఆడుకుంటూ చిన్నారులు ఇలా కారులో ఊపిరాడక చనిపోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read : Park Hyatt: పార్క్ హయత్ లో అగ్ని ప్రమాదం ! సన్ రైజర్స్ టీంకు తప్పిన ప్రమాదం !