Betting Apps: మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై హైకోర్టులో నమోదైన పిల్
మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలపై హైకోర్టులో నమోదైన పిల్
Betting Apps : తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు కొరడా ఝులిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్(Betting Apps) బారిన పడి… అప్పుల పాలై… ఎంతోమంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడటంతో… ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్లపై కేసు నమోదు చేయడంతో పాటు విచారణను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లలో నిషేధిత బెట్టింగ్ యాప్ ప్రకటనలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవాది నాగూర్ బాబు ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అనంతరం ఆయన తన వాదనలు వినిపించారు. ‘‘బెట్టింగ్ యాప్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా మెట్రో రైళ్లలో మాత్రం ప్రకటనలు ఇస్తున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్ లపై ఇప్పటికే ఈడీ విచారణ కొనసాగుతోంది. మెట్రో రైళ్లలో ఈ ప్రకటనలపైనా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు.
Betting Apps Issue
అయితే మెట్రో రైళ్లలో 2022 తర్వాత బెట్టింగ్ యాప్ ప్రకటనలు ప్రదర్శించలేదని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.
Also Read : PM Narendra Modi: పహల్గాం ఉగ్రదాడితో పాక్ కు ‘పంచ్’ ఇచ్చిన భారత్