MLC Addanki Dayakar: ఎన్డీయేకి దగ్గరయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు – ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
ఎన్డీయేకి దగ్గరయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు - ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
MLC Addanki Dayakar : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar) ఆసక్తికర కామెంట్స్ చేశారు. అందుకే చంద్రబాబు మేము వేరువేరు కాదని అంటూ చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారు అన్నారు. ఇటీవల ఓ ఛానెల్ కు కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వూపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ… ‘కేసీఆర్ డైరెక్షన్ లోనే కేటీఆర్ చంద్రబాబు గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారు. ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలి. కనీసం కేసీఆర్ కుటుంబం నుండి కాకుండా వేరే వెలమనైనా బీఆర్ఎస్ అధ్యక్షుడిని చేయగలరా? అంటూ ప్రశ్నించారు. కేటీఆర్‌కి దమ్ముంటే పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని సూచించారు.
MLC Addanki Dayakar Try to Jion NDA
అధ్యక్ష పదవి చేపట్టిన రెండు సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తెచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు?. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, నాన్ వర్కింగ్ ప్రెసిడెంటో ఆయనకే తెలియాలి. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకా? టీఆర్ఎస్ పార్టీకా?. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టి రెండేళ్లు అయింది. జనతా గ్యారేజ్ సినిమాలో ఓనర్ కొడుకు విలన్. బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అయితే పార్టీ ఓనర్ కొడుకు కేటీఆర్ విలనా?. కమలం పువ్వు కాడికి గులాబీ పువ్వును అంటగడుతున్నారు. చంద్రబాబు, మేము వేరువేరు కాదని కేటీఆర్ అంటున్నాడు. చంద్రబాబుకి మాకు సారూప్యత ఉందని కేటీఆర్ చెబుతున్నారు. హెచ్‌సీయూ విషయంలో బీఆర్ఎస్ హ్యాండిల్స్ నుండి ఫోటోలు ఎందుకు డిలీట్ చేస్తున్నారో చెప్పాలి’ అంటూ కామెంట్స్ చేశారు.
Also Read : Operation Karregutta: చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కగార్ ! ముగ్గురు మావోయిస్టులు మృతి ?