Kaleshwaram Scam: కాలేశ్వరం ప్రాజెక్టు స్కామ్ లో హరిరామ్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ

కాలేశ్వరం ప్రాజెక్టు స్కామ్ లో హరిరామ్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ

Kaleshwaram Scam : కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవకతవకల కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంజినీరింగ్ చీఫ్ ఈఎన్‌సీ భూక్య హరిరామ్‌ ను ఏసీబీ అధికారులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 6వ తేదీ వరకు అంటే ఐదు రోజుల పాటు హరి రామ్‌ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరి రామ్ కీలకంగా వ్యవహరించారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఇటీవల వెలువడింది. ఈ నేపథ్యంలో హరిరామ్‌ ను ఏసీబీ కస్టడీకు కోరింది. ఐదు రోజుల పాటు విచారణ చేయనుంది.

Kaleshwaram Scam…

కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ (ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌) భూక్యా హరిరామ్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram) డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్ధాయిలో అవినీతి జరిగిందని, ఇందులో హరిరామ్‌ కీలకపాత్ర షోషించారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హరి రామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హరి రామ్ ఇంటితోపాటు ఏకకాలంలో 14 ప్రదేశాల్లో బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ. 200 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మార్కుర్‌ లో 28 ఎకరాల భూమి, కొండాపూర్ షేక్స్‌పేట్, శ్రీనగర్, గజ్వేల్‌ , మాదాపూర్ ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. పటాన్ చెరువులో 20 గుంటల భూమి, ఆరెకరాల మామిడి తోట, ఫామ్ హౌస్‌ను గుర్తించారు.ముగిసిన అనంతరం ఆయనను పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీనితో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.

Also Read : Indian Government : భారత్‌ ను వీడే పాక్‌ పౌరులకు మరింత గడువు ఇచ్చిన కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!