Landmine Blast: ములుగు జిల్లాలో ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు పోలీసుల మృతి

ములుగు జిల్లాలో ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు పోలీసుల మృతి

 

చత్తీస్ గఢ్, జార్ఖండ్ దండకారణ్యంలో ఇటీవల జరిగిన వరుస ఎన్ కౌంటర్లతో… పెద్ద ఎత్తున మావోయిస్టులు తెలంగాణా, చత్తీస్ గఢ్ సరిహాద్దుల్లోని కర్రెగుట్టలులో తలదాచుకున్న విషయం తెలిసిందే. దీనితో గత వారం పదిరోజులుగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని కర్రెగుట్టలులో కూంబింగ్ ను ముమ్మరం చేసారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందినట్లు సమాచారం.

 

ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ చేస్తుండగా మందుపాతర పేలినట్లు తెలిసింది. మావోయిస్టులు గతంలో అమర్చిన మందుపాతర పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతిచెందారు. వీరు తెలంగాణ గ్రేహౌండ్స్‌కు చెందిన పోలీసులుగా తెలుస్తోంది. ఈ ఘటనను ములుగు ఎస్పీ ఇంకా ధ్రువీకరించలేదు. మందుపాతర పేలిన విషయం తెలియడంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ ఘటనతో మరోసారి మావోలు తమ ఉనికిని చాటుకున్నారు.

 

తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతాల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పోలీసు బలగాలు భారీగా పాల్గొంటున్నాయి. దీనితో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. మావోల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల మావోలకు, పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇటు పోలీసులు, పలువురు మావోలు మృతిచెందారు.

కేంద్రం చేపట్టిన చర్యలను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శాంతికమిటీతో చర్చలు కూడా జరిపారు. కేంద్రప్రభుత్వం మరోసారి ఆపరేషన్ కగార్‌పై ఆలోచించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని పౌర హక్కుల సంఘాల నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. కేంద్రం ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘాల నేతలు కోరారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని పౌర హక్కుల సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలో మావోలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచిచూస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!