AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
AP Liquor Scam : ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితోపాటు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు అధికారింగా ప్రకటించారు. వరుసగా మూడు రోజులపాటు వీరిని విచారించిన సిట్ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. అయితే మందస్తు బెయిల్ కోసం నిందితులిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ డిస్మిస్ చేసింది. దీనితో వారిద్దరినీ సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీకి చెందిన వారిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ మద్యం కుంభకోణం(AP Liquor Scam) వ్యవహారంలో పాత్రదారి, సూత్రదారైన రాజ్ కసిరెడ్డి… గోవా నుంచి హైదరాబాద్‌కు మారు పేరుతో రావడంతో అతడిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ఎదుట ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా కసిరెడ్డితోపాటు ఈ కేసులో పలువురు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవనే చర్చ జరుగుతోంది.
AP Liquor Scam – సుప్రీం కోర్టులో చుక్కెదురు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. వీరికి గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ తీర్పును ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. రెగ్యులర్ బెయిల్‌కు అప్లై చేస్తే నిబంధనలు, మెరిట్స్ ప్రకారం హైకోర్టు, ట్రయల్ కోర్టులు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
Also Read : Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు