Minister Shivraj Singh Chouhan: కేంద్రమంత్రిని కంటతడి పెట్టించిన రైతు కష్టం

కేంద్రమంత్రిని కంటతడి పెట్టించిన రైతు కష్టం

Minister Shivraj Singh Chouhan : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్నీ కావు. పంట చేతికి వస్తున్న సమయంలో అకాల వర్షాలతో పంట నేటమట్టం అయితే వాటిని చూస్తూ… పంటపొలాల్లో రైలు కన్నీరు పెడుతున్న దృశ్యాలు అనేకం. అయితే సరిగ్గా అలాంటి కష్టం ఇటీవల ముంబైలో కురుస్తున్న అకాల వర్షాలకు ఓ రైతు ఎదుర్కొన్నాడు. వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పంటను కాపాడేందుకు ఓ రైతు పడిన కష్టం వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. ఈ క్రమంలో బాధితుడితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Minister Shivraj Singh Chouhan..

మహారాష్ట్రకు చెందిన రైతు గౌరవ్‌ పన్వార్‌ తన వేరుశనగ పంటను అమ్ముకోవడానికి వాషిమ్‌ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా భారీ వర్షం కురవడంతో పంట నీటిలో కొట్టుకొనిపోయింది. దీనితో రైతు గౌరవ్‌ భారీ వర్షంలో తడుస్తూనే కొట్టుకుపోతున్న వేరుశనగను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ, వరద నీటిలో పంట కొట్టుకొనిపోయింది. ఈ హృదయవిదారక వీడియో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దృష్టికి రావడంతో.. స్వయంగా ఆయనే బాధిత రైతుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శివరాజ్‌ సింగ్‌(Minister Shivraj Singh Chouhan) వీడియోను తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ లో పోస్టు చేశారు.

ఆ వీడియోలో మంత్రి శివరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ… ‘ఈ విషయం నన్ను చాలా బాధించింది. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తాం. మీరు, మీ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై చాలా సున్నితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. అంతా మంచే జరుగుతుంది’ అని అన్నారు.

Also Read : Car Door: విజయనగరంలో ఘోర విషాదం ! కారులో ఊపిరి ఆడక నలుగురు చిన్నారుల మృతి !

Leave A Reply

Your Email Id will not be published!