Khalistan Terrorists: పంజాబ్‌లో ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు
పంజాబ్‌లో ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు
Khalistan Terrorists : పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో పాకిస్థాన్ గూఢచర్య ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈక్రమంలోనే పాక్ ఐఎస్‌ఐతో పాటు ఖలీస్థాన్ కు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) సంస్థతో సంబంధాలు ఉన్న ఒక మాడ్యుల్(ముఠా)ను పంజాబ్ (Punjab) పోలీసులు పట్టుకున్నారు. వీరు రెండ్రోజుల క్రితం బటాలాలో గ్రెనేడ్ దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
Khalistan Terrorists Arrest in Punjab
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… పాకిస్థాన్ ఐఎస్‌ఐ మద్దతుతో ఉగ్రవాద కార్యకలాపాలు చేసే ఒక మాడ్యుల్ ను పట్టుకున్నాం. ఇందులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. రెండ్రోజుల క్రితం వీరు బటాలాలోని ఒక మద్యం దుకాణం వద్ద గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. బీకేఐకు చెందిన మన్నూ అగ్వాన్ నుంచి అందిన సూచనల ప్రకారమే వీరు ఈ దాడికి పాల్పడ్డారు.
నిందితులను గుర్తించి అరెస్టు చేసి తీసుకెళ్తుండగా… పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ప్రతీకార కాల్పులు చేయాల్సివచ్చింది. ఈక్రమంలో నిందితుల్లో ఒకరైన జతిన్‌కుమార్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నాం. వీరినుంచి 30 తుపాకులను స్వాధీనం చేసుకొన్నాం. దీనిపై కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నాం.
Also Read : Jayant Narlikar: ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్ నార్లికర్ కన్నుమూత