Iran: ఇరాన్ అణుకేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళిక – అమెరికా ఇంటెలిజెన్స్
ఇరాన్ అణుకేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళిక - అమెరికా ఇంటెలిజెన్స్
Iran : ఇరాన్ తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్ లోని అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని పసిగట్టినట్లు సమాచారం. ఈమేరకు పలు అంతర్జాతీ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.
Iran Likely to Attacked
యూఎస్‌కు చెందిన అధికారులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ… ఇరాన్(Iran) అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని ఇటీవల తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ దాడులు జరిగితే దౌత్యపరమైన ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్న ట్రంప్ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్(Israel) తుది నిర్ణయం తీసుకుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని వెల్లడించారు. ఈ దాడుల ప్రణాళిక గురించి అటు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం కానీ, వాషింగ్టన్‌లోని టెల్అవీవ్ రాయబారి కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనిపై ఇటీవల ఒమన్‌లో ఉన్నతస్థాయి చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగి ఫలవంతం అయ్యాయని చర్చల్లో పాల్గొన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు. న్యూక్లియర్ డీల్ కుదరకపోతే సైనిక చర్యలకు దిగుతామంటూ ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు. ఈక్రమంలోనే ఇజ్రాయెల్ దాడులకు ప్రణాళికలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : Anuradha Paswan: రాజస్థాన్ పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికూతురు ! 26వ పెళ్లితో బట్టబయలైన వ్యవహారం !
