YS Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దత్తుగా షర్మిల నిరహార దీక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దత్తుగా షర్మిల నిరహార దీక్ష
YS Sharmila : విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజుల నుంచి విశాఖలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరంలో కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆమరణ నిరహార దీక్షకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila) ఆమరణ దీక్షకు దిగడంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. షర్మిలా రెడ్డి ఆమరణ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు పలికిన స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆమెను స్వాగతించారు.
YS Sharmila Hunger Strike
2021లో అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోగా… అప్పటి నుంచి వైఎస్ షర్మిల దీక్ష చేస్తూనే ఉన్నారు. మే 6వ తేదీన ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిన షర్మిల.. బీజేపీ హయాంలో స్టీల్ ప్లాంట్ కు కష్టాలు వచ్చాయని విమర్శించారు. అదానీకి మేలు చేయాలని స్టీల్ ప్లాంట్ ను చంపేస్తున్నారని ఆమె ఆరోపించారు. విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు అని షర్మిల గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్లో 34 వేల మంది ఉద్యోగులు ఉంటే.. 11 సంవత్సరాల్లో కారణం లేకుండా అనేకమందిని తొలగించారని ఆరోపించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో 20 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారన్నారు.
Also Read : Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్