Supreme Court: సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
Supreme Court : వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అరెస్ట్ నుంచి 2 వారాల పాటు మధ్యంతర ఉపశమనం కల్పించింది. ఆలోపు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా సజ్జల భార్గవరెడ్డిపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపైనా తీవ్ర అభ్యంతరం తెలిపింది. ‘‘సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా? ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం తెలుసుకోలేమా ? ఆ పోస్టులు భరించరాని స్థాయికి వెళ్లాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి వాటిని వ్యవస్థ క్షమించదు.. తప్పక శిక్షిస్తుంది. సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందనుకోవద్దు. అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారు’’ అని సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court – మాజీమంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసు
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ లుకౌట్ నోటీసు జారీ చేసింది. దేశం విడిచి పారిపోయేందుకు అవకాశం ఉన్న భూ, వాయు, జల మార్గాల్లో కొడాలి నానిపై పూర్తి స్థాయి నిఘా పెట్టాలని ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో కొడాలి నానిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏడేళ్లు జైలు శిక్ష పడే సెక్షన్లూ ఉన్నందున ఈమేరకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. వివిధ కేసుల్లోని నిందితులు దేశం విడిచి పారిపోతారనే అనుమానాలు ఉంటే కేంద్రం ఈ తరహాలో లుకౌట్ నోటీసులు జారీ చేస్తుంది.
Also Read : Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ! ఆరుగురి మృతి !