Rahul Gandhi: పూంఛ్‌ సెక్టార్ లోరాహుల్‌ గాంధీ పర్యటన ! పాక్ దాడుల బాధితులకు పరామర్శ !

పూంఛ్‌ సెక్టార్ లోరాహుల్‌ గాంధీ పర్యటన ! పాక్ దాడుల బాధితులకు పరామర్శ !

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పూంఛ్‌ ప్రాంతంలో పర్యటించారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకశ్మీర్‌ లోని పూంచ్‌ సెక్టార్ లో ప్రాణాలు కోల్పోయిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. పాకిస్థాన్ షెల్లింగ్‌ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు. ఇటీవల భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఘర్షణ నేపథ్యంలో పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడుల్లో జమ్మూకశ్మీర్‌ సరిహద్దు గ్రామాలు దెబ్బతిన్నాయి. పాక్‌ దాడుల కారణంగా పూంఛ్‌ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. సుమారు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక గృహాలు దెబ్బతిన్నాయి. ఈక్రమంలోనే బాధిత కుటుంబాలను కలుసుకునేందుకు రాహుల్‌(Rahul Gandhi) శనివారం అక్కడ పర్యటించారు.

ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలకు రాహుల్‌ వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. ఇక, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం రాహుల్‌ జమ్మూకశ్మీర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడి బాధితులను కలిసి వారికి భరోసా ఇచ్చారు. త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్‌లో పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు, రాహుల్ ఏప్రిల్ 25న శ్రీనగర్‌కు వెళ్లారు. ఈ సదర్భంగా రాహుల్ మాట్లాడుతూ… త్వరలోనే అంతా సర్దుకుంటుందన్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే, మీరు కష్టపడి చదవాలని అక్కడి పిల్లలకు రాహుల్ సూచించారు. కష్టపడి ఆడాలని, పాఠశాలలో చాలా మంది స్నేహితులను సంపాదించుకోవాలన్నారు.

Rahul Gandhi : రాహుల్‌ గాందీపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

ఝార్ఖండ్‌ లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టు రాహుల్‌గాంధీకి(Rahul Gandhi) నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. 2018లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌ షాపై రాహుల్‌ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేత ప్రతాప్‌ కటియార్‌ ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసుపై తాజాగా కోర్టు విచారణ జరిపింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ రాహుల్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. జూన్‌ 26న వ్యక్తిగతంగా హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.

Also Read : Southwest Monsoon: కేరళను తాకిన ‘నైరుతి’ ! 16 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి త్వరగా రుతుపవనాలు !

Leave A Reply

Your Email Id will not be published!