Mahesh Kumar Goud: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో మహేష్ గౌడ్ భేటీ

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో మహేష్ గౌడ్ భేటీ

Mahesh Kumar Goud : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మహేష్ కుమార్‌గౌడ్ చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించానని మహేష్ కుమార్‌గౌడ్ తెలిపారు. వీలైనంత త్వరగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ గాంధీని(Rahul Gandhi) కోరానని… త్వరగా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని మహేష్ కుమార్‌ అన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఒకటి, రెండుసార్లు తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపామని అన్నారు. తెలంగాణ కేబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని అధిష్టానానికి కోరామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Mahesh Kumar Goud – తెలంగాణ పీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో తెలంగాణ పీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడింది. ఈ నెల 30 మరోసారి ఢిల్లీ రావాలని సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అధిష్ఠానం సూచించింది. అంతకుముందు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సమావేశమైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌(Mahesh Kumar Goud) ఒకట్రెండు రోజుల్లో టీపీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన… సతీసమేతంగా రాహుల్‌ని కలిశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేబినెట్‌లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని కోరినట్లు చెప్పారు. కేబినెట్‌ కూర్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాహుల్‌ చెప్పారన్నారు. రాష్ట్రానికి సంబంధించి కొన్ని విషయాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, జై బాపు, జై భీమ్‌ కార్యక్రమాల గురించి ఆయనకు వివరించినట్లు చెప్పారు. పీసీసీ కార్యవర్గంపై ప్రకటన వస్తుందని తొలుత ఆశించినప్పటికీ.. ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ప్రక్రియ వాయిదా పడింది.

మూడో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ మూడో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ని వీరు కలిశారు. సుమారు గంట పాటు చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించినట్లు సమాచారం. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సామాజిక న్యాయసదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : IPL 2025 MI vs PBKS : టాప్ 2 బెర్త్ కోసం తలపడనున్న ముంబై, పంజాబ్ జట్లు

Leave A Reply

Your Email Id will not be published!