World Poorest Countries: ప్రపంచంలో అత్యంత పేద దేశాల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్ ఇండియా
ప్రపంచంలో అత్యంత పేద దేశాల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్ ఇండియా
World Poorest Countries : ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ప్రపంచంలోని మొత్తం 10 అత్యంత పేద దేశాల జాబితాను విడుదల చేయగా… వీటిలో ఎనిమిది ఆఫ్రికాలో ఉన్నాయి. జనవరి 16, 2025 నాటికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేసిన తలసరి GDP, PPP ప్రకారం 2025లో ప్రపంచంలోని అత్యంత పేద దేశాలు ఈ జాబితాలో ఉన్నాయని ఫోర్బ్స్ ఇండియా నివేదిక పేర్కొంది. ఈ ర్యాంకింగ్ తీవ్ర పేదరికంతో పోరాడుతున్న దేశాలను హైలైట్ చేస్తోంది. భారతదేశంతో బలమైన సంబంధాలు కలిగిన ద్వీప దేశం మడగాస్కర్ 10వ స్థానంలో ఉంది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.
World Poorest Countries…
ఫోర్బ్స్ ప్రకారం, ప్రపంచంలోని టాప్ 10 అత్యంత పేద దేశాల్లో అత్యల్ప తలసరి GDP కలిగి ఉన్న దేశం దక్షిణ సూడాన్. అత్యంత దురదృష్టకర దేశమనే బిరుదునూ ఆ దేశం కలిగి ఉంది. 2011లో స్వాతంత్ర్యం పొందిన ఈ చిన్న తూర్పు ఆఫ్రికా దేశంలో 11.1 మిలియన్ (1.1 కోట్లు) జనాభా ఉంది. మొత్తం GDP 29.99 బిలియన్ డాలర్లు. తర్వాతి స్థానాల్లో బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, యెమెన్, మొజాంబిక్, మలావి, కాంగో, సోమాలియా, లైబీరియా, మడగాస్కర్ ఉన్నాయి.
Also Read : Justice Yaswanta Sharma: జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ?
