Singer Mangli: సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి

సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి

Singer Mangli : ప్రముఖ సింగర్‌ మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్టులో స్నేహితులకు మంగళవారం రాత్రి ఆమె పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాత్రి 2 గంటల సమయంలో ఎస్‌వోటీ పోలీసులు రిసార్టుపై దాడులు చేశారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున విదేశీ మద్యం లభించింది. అదేసమయంలో కొంతమంది పార్టీలో పాల్గొన్న కొంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించగా… వారు గంజాయి సేవించినట్లు తేలింది. దీనితో సింగర్‌ మంగ్లీ(Singer Mangli), పార్టీ నిర్వాహకుడు, రిసార్ట్‌ నిర్వాహకుడు, టెస్టుల్లో గంజాయి పాజిటివ్‌ గా తేలిన ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ, న్యూసెన్స్‌ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Singer Mangli – డ్రగ్స్‌ తీసుకుంటే ఎంతటి ప్రముఖులైనా చర్యలు తప్పవు – తెలంగాణ పోలీస్‌

చట్టాలను ధిక్కరించి ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమని, లాఠీ ఝళిపించి గాడిన పెట్టాల్సి వస్తుందని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్‌(Drugs) లాంటి మత్తు పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీస్‌ తమ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు పెట్టింది. మంగళవారం రాత్రి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్‌పై చేవెళ్ల పోలీసులు దాడి చేసిన ఫొటోలను షేర్‌ చేసింది. మంగ్లీ(Singer Mangli) తీరుపై సీరియస్ అయిన పోలీసులు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం

సంచలనంగా మారిన పోలీసుల ట్వీట్

‘అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్‌పై దాడి చేసిన చేవెళ్ల పోలీసులు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుంది. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం’ అంటూ పోలీసు శాఖ ట్వీట్ చేసింది.

సింగర్ మంగ్లీ(Singer Mangli) చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం పుట్టిన రోజు పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి సెలబ్రెటీలు దివి, కాసర్ల శ్యామ్, జబర్దస్త్ రవి, సింగర్ ఇంద్రావతి హాజరయ్యారు. అయితే ఎంతో ఉల్లాసంగా జరుగుతున్న బర్త్‌వేడుకల్లో పోలీసులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. రిసార్ట్‌ నుంచి పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో చేవెళ్ల పోలీసులు రిసార్ట్‌పై దాడి చేశారు. త్రిపుర రిసార్ట్‌లో విపరీతమైన సౌండ్ పొల్యూషన్‌తో మంగ్లీ పార్టీ నిర్వహించింది. పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్‌ కు మంగ్లీ లిక్కర్ సరఫరా చేయించింది. పార్టీ కోసం పెద్ద ఎత్తున విదేశీ లిక్కర్‌ను తెప్పించారు. పార్టీకి అటెండ్ అయిన ఓ వ్యక్తికి గంజాయి పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది.

రైడ్ చేసే సమయంలో రిసార్ట్‌లో మంగ్లీకి చెందిన 50 మంది సన్నిహితులు ఉన్నారు. మొత్తం 48 మందికి పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారు. టెస్ట్ సమయంలో పోలీసులకు పార్టీలో పాల్గొన్నవారు ముప్పు తిప్పలు పెట్టారు. డ్రగ్ పరీక్షల సమయంలో పోలీసులతో మంగ్లీ స్నేహితురాలు దివి రాష్‌ గా బిహేవ్ చేశారు. అంతేకాకుండా సోదాలు జరపడానికి వచ్చిన పోలీసులపై సింగర్ మంగ్లీపై వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పార్టీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా సరే… సింగర్ మంగ్లీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బర్త్‌డే రోజే మంగ్లీపై చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

Also Read : Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం ! ముగ్గురు మృతి !

Leave A Reply

Your Email Id will not be published!