Suicide: భార్య వివాహేతర సంబంధానికి భర్త బలి

భార్య వివాహేతర సంబంధానికి భర్త బలి

Suicide :  వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాత్కాలిక సుఖం కోసం ప్రేమ పేరుతో భర్తను, పిల్లలను దూరం చేసుకుంటున్న మహిళలు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నారు. నిర్మొహమాటంగా భర్త ఎదుటే… ప్రియుడితోనే తన జీవితం అని తేల్చి చెప్తేస్తున్నారు. లేదంటే ప్రియుడితో కలిసి భర్తలను కడతేరుస్తున్నారు. అయితే భార్య వివాహేతర సంబంధంతో అవమానంగా భావించిన ఓ భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో మంగళవారం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే….

Committed Suicide

తడగొండకు చెందిన హరీశ్‌ (36)కు కరీంనగర్‌ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం జరిగింది. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. హరీశ్‌ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. కాగా అతడి భార్య… రక్షణ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయంలో ఫోన్‌లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నెల 8న హరీశ్‌ దుబాయి నుంచి తడగొండకు వచ్చాడు. ఈ క్రమంలో కావేరి ‘నువ్వు నాకు వద్దు.. చచ్చిపో.. నేను రక్షణ్‌తోనే ఉంటా’అని భర్తతో తేల్చిచెప్పింది.దీనితో మనస్తాపం చెందిన హరీశ్‌ మంగళవారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆదేశాలతో బావిలోని నీటిని మోటార్లతో తోడేయగా, హరీశ్‌ మృతదేహం లభ్యమైంది. హరీశ్‌ తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కావేరి, రక్షణ్‌ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపారు.

ఇందిరమ్మ ఇల్లు రాలేదని వ్యక్తి ఆత్మహత్య

ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు(Suicide) పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బండారుపల్లిలో చోటుచేసుకుంది. బండారుపల్లి గ్రామానికి చెందిన నీరటి పర్శరాములు (42) కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇల్లు మంజూరైనట్టు గ్రామంలోని కొందరు నాయకులు తెలపడంతో ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు అందుతాయన్న ఆశతో తెలిసిన వారి వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకుని బేస్‌మెంట్‌ వరకు నిర్మించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత మంజూరైన ఇళ్ల జాబితాను ప్రభుత్వం రద్దు చేసిందంటూ బాధితుడికి నాయకులు చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ రవికాంత్‌రావు తెలిపారు.

Also Read : Singer Mangli: సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి

Leave A Reply

Your Email Id will not be published!