Quantum Valley: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ
అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ
Quantum Valley : అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో చేసిన డిక్లరేషన్ కు ఆమోదం తెలుపుతూ… ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 23ను సోమవారం విడుదల చేసారు. జూన్ 30న విజయవాడలో ‘అమరావతి క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్’ను (Quantum Valley) నిర్వహించినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద క్వాంటమ్ బెడ్‌గా క్వూ-చిప్-ఇన్ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి (Amaravati) అభివృద్ధే లక్ష్యమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించారు.
Quantum Valley Orders
అమరావతిని గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్’ను జూన్ 30న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డిక్లరేషన్‌పై నేడు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ద్వారా క్వాంటం పరిశోధన, ఆవిష్కరణ, ప్రతిభ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనునట్టు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద క్వాంటం బెడ్‌గా క్వూ – చిప్ – ఇన్ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటం కేంద్రంగా అమరావతి అభివృద్ధే లక్ష్యమని ఉత్తర్వుల్లో తెలిపారు. 2026లో ప్రారంభం అయ్యే అమరావతి క్వాంటం అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు కలిసి కొత్త టెక్నాలజీని సమన్వయంతో పనిచేసే దిశగా చర్చలు జరిగాయన్నారు.
Also Read : Minister Kinjarapu Atchannaidu: వైసీపీ అధినేత జగన్ పై మంత్రి అచ్నెన్నాయుడు ఫైర్
