IMD: వాతావరణ అంచనాల కోసం 1,800 కోట్లతో మరో రెండు ఉపగ్రహాలు – ఐఎండీ
వాతావరణ అంచనాల కోసం 1,800 కోట్లతో మరో రెండు ఉపగ్రహాలు - ఐఎండీ
IMD : అత్యంత కచ్చితత్వంతో మరింత మెరుగ్గా వాతావరణ అంచనాలను తయారుచేసేందుకు వీలుగా ఇన్సాట్-4 సిరీస్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) (IMD) నిర్ణయించింది. ఇస్రో సాయంతో రెండు ఉపగ్రహాలను ప్రయోగించి, 2028-29 నాటికి వినియోగంలోకి తెచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలకు రూ.1,800 కోట్ల వ్యయం అవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.
IMD New Updates
అంతరిక్షం నుండి తీసిన చిత్రాల్లో మెరుగైన రిజల్యూషన్‌తో వచ్చేలా, పిడుగుపాటును గుర్తించేందుకు సైతం వీలుగా అత్యాధునిక సెన్సర్లను ఈ ఉపగ్రహాల్లో అమర్చనున్నారు. కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో వాతావరణ అంచనాలకు పరికరాలు, రాడార్లు ఏర్పాటు చేయడం కష్టమని, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని ఐఎండీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐఎండీ వినియోగిస్తున్న రెండు ఉపగ్రహాల ద్వారా మేఘాల విస్ఫోటాలు, ఉరుములు, మెరుపులు, తదితర వాతావరణ పోకడలను గుర్తించడంలో కొన్నిసార్లు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలు తలెత్తకుండా అత్యాధునిక సెన్సర్లతో ఇన్సాట్-4 సిరీస్ ఉపగ్రహాలు రూపుదిద్దుకుంటాయి. వీటి ద్వారా అంచనాల్లో కచ్చితత్వం 20 శాతం నుంచి 30 శాతం వరకు మెరుగుపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది.
Also Read : YS Sharmila: వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులకు షర్మిల సంఘీభావం
