Mega DSC: మెగా DSC ఫలితాలు విడుదల

మెగా DSC ఫలితాలు విడుదల

Mega DSC : ఏపీ మెగా DSC ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లోకి వెళ్లి స్కోరు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఫలితాలను https://apdsc.apcfss.inలో తెలుసుకోవచ్చు.

ఇక ఈ ఫలితాలు విడుదల చేసిన అనంతరం మెగా డీఎస్సీ (Mega DSC) పరీక్ష కన్వీనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ… అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ ద్వారా తుది ఫలితాలు, స్కోర్ కార్డులను పొంద వచ్చని సూచించారు. టెట్ వివరాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్ సైట్‌లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమకు తామే టెట్ వివరాలు సరిచేసుకోనే అవకాశమిచ్చామన్నారు. ఈ అవకాశం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. అంటే ఆగస్ట్ 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Mega DSC – స్కోర్‌ కార్డు డౌన్‌ లోడ్‌ చేసుకోవడం ఎలా అంటే ?

అభ్యర్థులు తొలుత క్యాండిడేట్‌ లాగిన్‌లోకి వెళ్లాలి. అక్కడ తమ హాల్‌టికెట్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేస్తే.. ‘సర్వీసెస్‌’ అని వస్తుంది. అక్కడ ఏపీ (AP) డీఎస్సీ ఫలితాలను సెలక్ట్‌ చేసుకుంటే స్కోరు కార్డు అందుబాటులోకి వస్తుంది. అందులో అభ్యర్థులు రాసిన మొత్తం పేపర్లు, సాధించిన స్కోరు, టెట్‌ స్కోరును పేర్కొంటూ క్వాలిఫైడ్‌/నాన్‌ క్వాలిఫైడ్‌ అనే వివరాలు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నియామకానికి మెగా డీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్ష కోసం మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి జులై 2వ తేదీ వరకు.. అంటే 23 రోజుల పాటు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఆ రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్న తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిశాల్లో సైతం ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మెగా డీఎస్సీ పరీక్షలకు 92.90 శాతం మంది హాజరయ్యారు.

Also Read : Adaso Kapesa: ఎస్పీజీలో తొలి మహిళా ఆఫీసర్‌ గా అదాసో కపేసా !

Leave A Reply

Your Email Id will not be published!