Double Decker Buses: చెన్నై నగరంలో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు
చెన్నై నగరంలో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు
Double Decker Buses : చెన్నై నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల సంచారం ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం పలుచోట్ల డబుల్ డెక్కర్ బస్సులతో ట్రయల్ రన్ వేశారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు మహానగర రవాణా సంస్థ ఈ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపింది. నగరంలోని కోయంబేడు, సెంట్రల్ స్టేషన్, బ్రాడ్వే, మాధవరం, పూందమల్లి, తాంబరం, ఆవడి ప్రాంతాల మీదుగా డబుల్ డెక్కర్ బస్సుల ట్రయల్ రన్ నిర్వహించారు.
Double Decker Buses Will Be Available in Chennai
ఇటీవల ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ప్రారంభించిన ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను తలపించేలా పై అంతస్థుతో, ఎరుపురంగులో ఉన్న ఈ బస్సుల సంచారాన్ని చూసి నగరవాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైతో పాటు కోల్కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో డబుల్ డెక్కర్ బస్సులు 1970 నుంచే నడిచాయి. ప్రస్తుతం మళ్ళీ కొత్త హంగులతో తయారైన 20 డబుల్ డెక్కర్ సిటీ బస్సులను నగరవాసులకు వింత అనుభూతిని కలిగించనున్నాయి.
Also Read : Jeep Wagoneer: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా భూటాన్ రాజు కారు
