Governor Abdul Nazeer: ఏపీ రాజ్‌భవన్‌ లో ఆహ్లాదకరంగా ఎట్‌ హోం !

ఏపీ రాజ్‌భవన్‌ లో ఆహ్లాదకరంగా ఎట్‌ హోం !

Governor Abdul Nazeer : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్ (Governor Abdul Nazeer) తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ లు సతీ సమేతంగా హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ విజయానంద్‌, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, ఇతర సీనియర్‌ అధికారులు, ‘పద్మ’ పురస్కార గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer).. అతిథుల వద్దకు స్వయంగా వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించారు.

Governor Abdul Nazeer – ఏపీకు భారీ వర్ష సూచన

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రం 5 గంటలకు 2,98,209 క్యూసెక్కులు ఉందన్నారు. ప్రస్తుతానికి వరద తగ్గుముఖం పట్టిందని, ఎగువ ప్రాంతాల్లోని వర్షాల ప్రభావంతో హెచ్చుతగ్గులు ఉండొచ్చని పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. జాగ్రతలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నాటికి విశాఖ జిల్లా పెందుర్తిలో 63మిమీ, అనకాపల్లి పాతవలసలో 44మిమీ, విశాఖ రూరల్ లో 40మిమీ వర్షపాతం నమోదయిందన్నారు.

Also Read : Stree Shakti Scheme: మహిళలకు ‘ఉచిత బస్సు’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!