Rahul Mamkootathil: నటి ఆరోపణలుతో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
నటి ఆరోపణలుతో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
Rahul Mamkootathil : కేరళ కాంగ్రెస్‌లో ఓ నటి ఆరోపణలు కలకలం రేపాయి. దీనితో ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాహుల్ మామకుటత్తిల్ (Rahul Mamkootathil) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పాలక్కడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానూ ఉన్నారు. అదూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామాను ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఓ ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని, మూడేళ్లుగా వేధిస్తున్నారంటూ రీని జార్జ్ అనే నటి ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆ పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లినా… ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. రాహుల్ (Rahul Mamkootathil) పేరును ఆమె నేరుగా ప్రస్తావించనప్పటికీ… బీజేపీ, సీపీఎం శ్రేణులు ఆయన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నాయి. రాజీనామా చేయాలని నిరసనలు చేపడుతున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీలో అంతర్గత విచారణ చేపట్టినట్లు, దోషులు తప్పించుకోలేరని కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ ప్రకటించారు.
Rahul Mamkootathil Resign
ఈ పరిణామాల నడుమే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ (Rahul Mamkootathil) రాజీనామా ప్రకటించారు. ‘‘నాపై వచ్చిన ఆరోపణల విషయంలో పార్టీ పెద్దలతో మాట్లాడాను. వారెవరూ నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదు. ఆ నటి నా స్నేహితురాలు. ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తి నేను కాదని నమ్ముతున్నాను. నేను ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడలేదు’’ అని పేర్కొన్నారు. దేశ రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా నేను ఇప్పటిదాకా ఎలాంటి తప్పు చేయలేదు. నా మీద ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. ఏ తప్పు చేయకపోయినా నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలేనని నిరూపించేందుకు ఈ రాజీనామా.
నాకు మద్దతుగా నిలవడం కాంగ్రెస్ కార్యకర్తల పని కాదు. వాళ్లను ఆ పని చేయమని నేను కోరే రకమూ కాదు. నా నిర్దోషిత్వాన్ని నేను నిరూపించుకుంటా. ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం నాతో సహా ప్రతీ ఒక్కరి బాధ్యత’’ అని ఆదూర్ నివాసంలో మీడియా ప్రతినిధులకు ఆయన తెలిపారు.
మలయాళ నటి రిని ఆన్ జార్జ్ సంచలన ఆరోపణలతో ఇవాళ కేరళ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఓ యువ ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అసభ్యంగా తనకు సందేశాలు పంపించాడని, హోటల్‌కు రమ్మంటూ ఒత్తిడి చేశాడని, ఈ వ్యవహారంపై అతని పార్టీకి ఫిర్యాదు చేస్తానని చెబితే చేసుకోమని సమాధానామిచ్చాడని తెలిపింది. తనలాగే చాలామంది బాధితులు ఉన్నారంటూ ఆమె మీడియాకు తెలిపింది. ఈ క్రమంలో… రాహుల్ మమ్‌కూటథిల్ పేరు తెర మీదకు వచ్చింది. అయితే ఆమె తనకు మంచి స్నేహితురాలని, తన పేరేం చెప్పలేదు కదా అని అంటూనే.. బహుశా వేరేవరో ఆమెను వేధించి ఉంటారని మీడియాతో అన్నాడు.
మలయాళీ రైటర్ హనీ భాస్కరన్ ఏకంగా రాహుల్ మమ్‌కూటథిల్ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. దీనితో దుమారం రేగింది. అధికార సీపీఐ(ఎం) కూటమి ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో వ్యవహారం హైకమాండ్‌కు చేరడంతో… రాహుల్ మమ్‌కూటథిల్‌ను రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ కోరినట్లు అక్కడి మీడియా చానెల్స్‌లో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. చిన్నవయసులోనే పలు వ్యాపారాల్లో రాణించిన రాహుల్ మమ్‌కూటథిల్.. 2006లో కేరళ స్టూడెంట్స్ యూనియన్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. జిల్లా అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించాడు. కిందటి ఏడాది పాలక్కడ్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Also Read : Children: కర్నూలు జిల్లాలో ఘోర విషాదం ! నీటి కుంటలో దిగి ఆరుగురు చిన్నారుల మృతి !
