Congress MLA: బెట్టింగ్‌ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ! అరెస్ట్‌ రూ.12కోట్ల నగదు స్వాధీనం !

బెట్టింగ్‌ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ! అరెస్ట్‌ రూ.12కోట్ల నగదు స్వాధీనం !

Congress MLA : బెట్టింగ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రపప్పిను ఈడీ అరెస్ట్ చేసింది. క్యాసినో కోసం భూమిని లీజుకు తీసుకునేందుకు సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ కు వెళ్లిన ఆయన్ను… అక్కడే అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచింది. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై బెంగళూరుకు తరలించింది. ఎమ్మెల్యే వీరేంద్రతోపాటు ఆయన సోదరుల నివాసాలు, కార్యాలయాలు, క్యాసినోల్లో సోదాలు జరిపిన ఈడీ (ED).. రూ.12 కోట్ల నగదు సహా పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకుంది.

Congress MLA Arrest

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై కేసీ వీరేంద్రపప్పిను గ్యాంగ్‌టక్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. వీరేంద్ర పలు అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లు నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్‌లో మూడు సంస్థలు ద్వారా గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అరెస్టు క్రమంలో ముందుగా దేశవ్యాప్తంగా వీరేంద్రకు సంబంధించిన 30 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు జరిపింది. 22, 23(శుక్ర, శని) తేదీల్లో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాతో సహా పలు రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. గోవాలోని ఐదు ప్రముఖ కాసినోలపై కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడ్డాయి. ఈడీ సోదాల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

ఈ తనిఖీల్లో సుమారు రూ. 12 కోట్ల నగదు, రూ. 6 కోట్ల విలువైన గోల్డ్‌ ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదులో దాదాపు కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఖరీదైన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వీరేంద్రకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. రెండు బ్యాంక్ లాకర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది.

Also Read : Justice Sudershan Reddy: ‘సల్వా జుడుం’పై తీర్పు నా వ్యక్తిగతం కాదు – జస్టిస్‌ సుదర్శన్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!