TVK Party: సుప్రీంకోర్టుకు నటుడు విజయ్ టీవీకే పార్టీ
సుప్రీంకోర్టుకు నటుడు విజయ్ టీవీకే పార్టీ
TVK Party : తమిళనాడు స్టార్ హీరో విజయ్ ఏర్పాటుచేసిన తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరువు హత్యలకు సంబంధించిన ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ఆ పార్టీ కోరింది. ఇటీవల రాష్ట్రంలో ఓ దళిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీవీకే (TVK Party) జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పరువు హత్యలను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనలు సరిపోవడం లేదని ఆయన అందులో వాదించారు.
TVK Party to Supreme Court
జులై 27న తిరునెల్వేలిలో ఐటీ ఉద్యోగి అయిన కవిన్ సెల్వగణేషన్ (27) హత్య ఇటీవల సంచలనం రేపింది. కవిన్ వేరొక సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇది నచ్చని ఆమె సోదరుడు సుర్జిత్, కవిన్ ను హత్య చేశాడు. దీనితో సబ్-ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న నిందితుడి తల్లిదండ్రులు కృష్ణకుమారి, శరవణన్ లు సస్పెండ్ అయ్యారు. ఈ హత్యకు సంబంధించి సుర్జిత్ తో పాటు అతడి తండ్రి శరవణన్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పలు పార్టీలు ఈ పరువు హత్యలకు సంబంధించి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరాయి. ఈ క్రమంలో టీవీకే సుప్రీంను ఆశ్రయించింది. ప్రస్తుతం సీబీసీఐడీ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Ram Setu: ‘రామ సేతు’ విషయంలో కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
