Mumbai: ముంబయి వీధులను రేపటిలోగా ఖాళీ చేయండి – బాంబే హైకోర్టు
ముంబయి వీధులను రేపటిలోగా ఖాళీ చేయండి - బాంబే హైకోర్టు
Mumbai : మరాఠాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. మరోవైపు మరాఠా కోటా నిరసనలపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిరసనలు ముంబయిలో తీవ్ర ట్రాఫిక్ జామ్ కు కారణం కావడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేపటి(సెప్టెంబర్ 2)లోగా నిరసనకారులు ముంబయి వీధులను వీడాలని ఆదేశాలిచ్చింది.
Mumbai High Court Key Instructions
సోమవారం ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో మరాఠా రిజర్వేషన్ల ఆందోళన చేపట్టారు. వేలాది మంది నిరసనకారులు దక్షిణ ముంబయికి చేరుకోవడంతో… సీఎస్టీ, ఫోర్ట్, చర్చిగేట్ తదితర మార్గాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిరసనకారులు పలు మార్గాలను బ్లాక్ చేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనితో ఈ నిరసనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిరసనలు శాంతియుతంగా జరగడం లేదని… నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నారని కోర్టు వ్యాఖ్యనించింది. ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాటిల్, అతడి మద్దతుదారులు ముంబయి వీధులను మంగళవారం మధ్యాహ్నంలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. అయితే మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలన్న తన డిమాండ్ నెరవేరే వరకూ ముంబయి విడిచి వెళ్లబోనని కోటా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాటిల్ ఆదివారం తెగేసిచెప్పిన విషయం తెలిసిందే.
Also Read : Minister Nara Lokesh: ఆస్ట్రేలియా ప్రభుత్వం నుండి అరుదైన గౌరవం దక్కించుకున్న మంత్రి లోకేష్
