AAI Senior Manager: ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ‘లక్కీ భాస్కర్’ అరెస్ట్

ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ 'లక్కీ భాస్కర్' అరెస్ట్

AAI : ‘లక్కీ భాస్కర్’ సినిమాలో దుల్కర్ సాల్మన్ బ్యాంకును మోసం చేసి… ఆ డబ్బును షేర్ మార్కెట్ లో పెట్టి… తరువాత తన వ్యక్తిగత ఖాతాలోనికి మళ్ళించి విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసి ఫ్యామిలీతో సెటిల్ అవడం చూసాము. సరిగ్గా అదే తరహాలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీకు చెందిన రూ.232 కోట్లకు పైగా తన వ్యక్తిగత ఖాతాలోకి సొంత వ్యాపార ప్రయోజనాల కోసం మళ్లించారనే ఆరోపణలతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్‌ను CBI అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. డెహ్రాడూన్ విమానాశ్రయంలో తన పోస్టింగ్ సమయంలో మూడు సంవత్సరాలలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేసే రాహుల్ విజయ్ ఈ అక్రమాలకు పాల్పడ్డారు. బూటకపు అకౌంటింగ్ ఎంట్రీల ద్వారా సంస్థ సొమ్ములు తన వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేశారని అధికారులు తెలిపారు.

AAI Senior Manager Arrest

అధికారిక, ఎలక్ట్రానిక్ రికార్డులను తారుమారు చేయడం ద్వారా విజయ్ ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక క్రమ పద్దతిలో, ప్లాన్ ప్రకారం AAI నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని CBI ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.’దర్యాప్తు సమయంలో, 2019-20 నుండి 2022-23 మధ్య కాలంలో, నిందితుడు డెహ్రాడూన్ విమానాశ్రయంలో విధులు నిర్వర్తిండగా ఈ మోసాలకు పాల్పడినట్టు తేల్చారు. నకిలీ, కల్పిత ఆస్తులను సృష్టించడం ద్వారా, ఎంట్రీలకు సున్నాలను జోడించడం ద్వారా ఎలక్ట్రానిక్ రికార్డులను తారుమారు చేసినట్లు తేలింది’ అని ఆమె చెప్పారు.

బ్యాంకు లావాదేవీల ప్రాథమిక విశ్లేషణలో తేలిన విషయం ఏంటంటే.. విజయ్ అలా జమ చేసిన నిధులను ‘ట్రేడింగ్ ఖాతాలకు’ బదిలీ చేశారని, తద్వారా ప్రజా ధనాన్ని స్వాహా చేశారని ఏజెన్సీ కనుగొంది. సంస్థ నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో అవకతవకలు బయటపడ్డ తర్వాత AAI ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కల్పిత అకౌంటింగ్ ఎంట్రీలు ద్వారా అధికార ఖాతాల నుండి విజయ్ వ్యక్తిగత ఖాతాలకు అనధికార నిధుల బదిలీల విషయాన్ని కమిటీ బయటపెట్టింది. దీంతో AAI సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్) చంద్రకాంత్ ఆగస్టు 18న CBIకి అధికారిక ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టింది.

Also Read : S-400: భారత్ కు మరిన్ని ఎస్‌-400 ?

Leave A Reply

Your Email Id will not be published!