Terrorists: దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

Terrorists : దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో టెర్రరిస్టులను (Terrorists) అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని బోధన్ లో ఒకరిని అరెస్ట్‌ చేశారు. పాక్‌ హ్యాండ్లర్లతో కలసి టెర్రరిస్టులు దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్‌ అయినవారిలో కెమికల్‌ బాంబుల తయారీ ఎక్స్‌పర్ట్‌ డానిష్‌ ఉన్నాడు. భారీ టెర్రర్‌ మాడ్యుల్‌ను ఢిల్లీ పోలీసులు గుట్టురట్టు చేశారు.

దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్‌ చేసింది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. టెర్రరిస్టుల నుంచి భారీగా తుపాకీలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ముంబైకి చెందిన అఫ్తాబ్, అబు సుఫియాన్‌లను ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. ఆషర్ డానిష్‌ను రాంచీలో, కమ్రాన్ ఖురేషీని మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో, హుజైఫ్ యెమెన్‌ను తెలంగాణలో అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని తమ హ్యాండ్లర్లతో సోషల్ మీడియా ద్వారా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు.

Terrorists – ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ ! 10 మంది మావోయిస్టులు మృతి !

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గరియాబంద్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్‌ జిల్లా ఘన్‌పూర్‌కు చెందిన మనోజ్‌ అలియాస్‌ మోదెం బాలకృష్ణ సహా 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మనోజ్‌పై గతంలో రూ.2 కోట్ల రివార్డు ఉంది. మృతుల్లో ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్‌ యారఫ్‌ పాండు కూడా ఉన్నారు. మరికొందరు కీలకనేతలు చనిపోయినట్టు భావిస్తున్నారు. ఎదురు కాల్పులు ముగిసిన తర్వాతే మృతులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. గరియాబంద్‌ ఈ30, ఎస్‌టీఎఫ్‌, కోబ్రా జవాన్లు ఆపరేషన్‌లో పాల్గొన్నారు. గరియాబంద్‌ ఎస్పీ నిఖిల్‌ రఖేచా ఎన్‌కౌంటర్‌ని పర్యవేక్షిస్తున్నారు.

Also Read : Transgenders: పంజాబ్ వరద బాధితులకు ట్రాన్స్‌జెండర్‌ ల భారీ విరాళం

Leave A Reply

Your Email Id will not be published!