CM Revanth Reddy: హైదరాబాద్‌-బెంగళూరు బుల్లెట్‌ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం -సీఎం రేవంత్‌

హైదరాబాద్‌-బెంగళూరు బుల్లెట్‌ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం - సీఎం రేవంత్‌

CM Revanth Reddy : హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొన్న సీఎం రేవంత్ (CM Revanth Reddy)… 2047 నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను వివరించారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రైవేటు రంగం మద్దతు గురించి తెలిపారు. అభివృద్ధి కోసం ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ రూపొందించుకున్నట్లు చెప్పారు.

CM Revanth Reddy Comment

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ… ‘‘హైదరాబాద్‌లో కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరంలో ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా నిర్మిస్తున్నాం. ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లకు విస్తరిస్తున్నాం. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఆ సంఖ్యను 15 లక్షలకు పెంచాలనేదే మా లక్ష్యం. గుజరాత్‌లోని సబర్మతీ తీరంలా మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం. దీనికోసం మూసీ రివర్‌ఫ్రంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్‌ వెలుపలకు తరలిస్తున్నాం. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం.

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తున్నాం. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం. డ్రగ్స్‌ కట్టడిలో మా రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉన్నారు. 2034 కల్లా ట్రిలియన్‌ డాలర్ల, 2047 కల్లా మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారాలనేది మా లక్ష్యం. దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచే రావాలనేది మా ధ్యేయం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ సెక్రటేరియట్‌ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ సచివాలయ ప్రాంతాన్ని ఇకపై నో ఫ్లై జోన్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల సచివాలయం భవనంపై డ్రోన్ ఎగరవేసిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన సెక్రటేరియట్ భద్రతకు లోపం తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. సచివాలయం ప్రాంగణం చుట్టూ ‘నో డ్రోన్ జోన్’ అని పేర్కొంటూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

సచివాలయంపై లేదా పరిసర ప్రాంతాల్లో అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు సచివాలయ భవనంపై డ్రోన్ ఎగరవేసిన ఘటన కలకలం రేపింది. దానిపై అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమై వెంటనే విచారణ ప్రారంభించారు. ఈ ఘటన పునరావృతం కాకుండా చూసేందుకే ప్రభుత్వం ఈ “నో ఫ్లై జోన్” నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : India: భారత్ అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం – ఎంఈఏ  

Leave A Reply

Your Email Id will not be published!