Ex MLC Kavitha: నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వాళ్లను వదలను – కవిత

నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వాళ్లను వదలను - కవిత

Ex MLC Kavitha : తనను తన కుటుంబానికి దూరం చేసిన వారిని వదిలిపెట్టే ప్రశక్తి లేదంటూ తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Ex MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేసారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘చింతమడక గ్రామం అంటే చరిత్ర సృష్టించిన గ్రామం. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కావాలని ముందడుగు వేశారు. అందుకే ఈరోజు మనకు ప్రత్యేక తెలంగాణ వచ్చింది. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం మొదలై చరిత్ర సృష్టించింది. చాలా ఏళ్లుగా నేను చింతమడకకు రాలేదు… ప్రత్యేక పరిస్థితుల్లో కూడా మీ ఆహ్వానం మేరకు వచ్చాను. చిన్నప్పటి నుంచి ఈ గ్రామంలో కులాలు, మతాలకు అతీతంగా పండగలు చేసుకునే వాళ్లం. చింతమడక ఏదైతే నేర్పించిందో అదేవిధంగా అన్ని కులాలను కలుపుకొని పోతున్నా. ఈనేల ఇచ్చిన ధైర్యంతోనే రాష్ట్రం మొత్తం తిరిగి బతుకమ్మ నిర్వహించా.

2004లో ఉద్యమం మొదలైన తర్వాత కేసీఆర్‌ (KCR)… మరొకరిని తీసుకువచ్చి ఇక్కడ పెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే.. సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా ఆంక్షలు ఉన్నాయి. ఈ నా జన్మభూమి భవిష్యత్తులో కర్మ భూమి కావచ్చని పేర్కొన్నారు. కొందరు సిద్దిపేట, చింతమడక తమ ప్రైవేట్‌ ప్రాపర్టీలా వ్యవహరిస్తున్నారు. చింతమడక చిరుత పులులను కన్నది. రాజకీయంగా ఆంక్షలు పెడితే మళ్లీ ఇక్కడకు వస్తాం. కేసీఆర్‌కు మచ్చ తెచ్చే పనులు కొందరు చేశారు. ఇదే విషయం నేను చెబితే నన్ను బద్నాం చేశారు. నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వాళ్లను వదలను. ఈ గడ్డ ఎవరి జాగీరూ కాదు.. ఆంక్షలు పెడితే మళ్లీ మళ్లీ వస్తా. కుటుంబానికి దూరం చేశారు అన్న బాధలో ఉన్నా. దుఃఖంలో ఉన్న నన్ను మీరంతా గౌరవించారు.. మీ ఆదరికీ రుణపడి ఉంటా’’ అని కవిత అన్నారు.

Ex MLC Kavitha – తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హనుమకొండ వేయి స్తంభాల ఆలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రులు భట్టి విక్రమార్క జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పూలనే దైవంగా పూజించే విష్టమైన పండుగ బతుకమ్మ అని అన్నారు. రంగురంగుల పువ్వులతో మహిళలు బతుకమ్మలు పేర్చారు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ పాటపాడి ఆకట్టుకున్నారు. మరోవైపు తెలంగాణ భవన్‌, ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్‌, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

Also Read : Hydra: గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు

Leave A Reply

Your Email Id will not be published!