Elon Musk: మస్క్ ‘ఎక్స్’ దావా కేసును తోసిపుచ్చిన న్యాయస్థానం

మస్క్ ‘ఎక్స్’ దావా కేసును తోసిపుచ్చిన న్యాయస్థానం

Elon Musk : దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్‌’కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. సమాచారాన్ని బ్లాక్ చేయాలని ప్రభుత్వ అధికారులు ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని ‘ఎక్స్‌’ కోర్టులో సవాలు చేసింది. ఆ పిటిషన్‌ను తాజాగా ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. భారత్‌లో ఎలాంటి నియంత్రణలేకుండా సోషల్ మీడియా సంస్థలు కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఉండదని స్పష్టంచేసింది. అమెరికా న్యాయ తార్కికతను ఇక్కడకు తీసుకురావొద్దని హెచ్చరించింది.

Elon Musk Case

ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమకున్న చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది తమపై అనధికారికంగా సెన్సార్ చేయడం కిందికే వస్తుందని ఎక్స్ సంస్థ కేంద్రప్రభుత్వంపై కొన్నినెలల క్రితం దావా వేసింది. ప్రభుత్వం ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79(3)(b)ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. ఐటీ చట్టం ప్రకారం.. బ్లాక్‌ చేసిన కంటెంట్‌ను తొలగించకపోతే, ఎక్స్‌ తన చట్టబద్ధమైన రక్షణ కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ సెక్షన్‌ కింద కంటెంట్ బ్లాక్ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని, సెక్షన్ 69Aని పక్కదారి పట్టించడానికి అధికారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇరు పక్షాల వాదలను విన్న తర్వాత కోర్టు తీర్పు వెలువడింది.

Also Read : Union Government: ఎన్నికల వేళ బిహార్‌కు కేంద్రం వరాల జల్లు

Leave A Reply

Your Email Id will not be published!