Spoons: యువకుడి పొట్టలో 29 స్పూన్‌లు, 19 బ్రష్‌లు
యువకుడి పొట్టలో 29 స్పూన్‌లు, 19 బ్రష్‌లు
Spoons : కుటుంబంపై కోపంతో ఓ యువకుడు చెంచాలు, బ్రెష్‌లు మింగిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తనకు ఇష్టం లేకున్నా డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించినందుకు అతడు ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. అయితే, తొలుత అతడి స్కానింగ్ రిపోర్టులు పరీక్షించిన వైద్యులు.. కడుపులో భారీగా స్టీల్ సంబంధిత వస్తువులు ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు.
Spoons Eating Shocking
ఉత్తర్‌ప్రదేశ్ హాపుడ్‌కు చెందిన సచిన్ (40) మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతడి కుటుంబీకులు గజియాబాద్‌లోని ఓ డీ-అడిక్షన్ కేంద్రంలో చేర్పించారు. అక్కడ పరిమిత ఆహారం ఇస్తుండటం, చికిత్సా విధానం అతడికి నచ్చలేదు. ఇష్టం లేకున్నా ఈ కేంద్రంలో చేర్పించారని కుటుంబీకులపై కోపాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడున్న స్పూన్‌లు, టూత్ బ్రష్‌లను తస్కరించసాగాడు. వాటిని బాత్‌రూమ్‌కు తీసుకెళ్లి ముక్కలుగా విరిచి మింగేయడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలోనే ఇటీవల అతడికి కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎక్స్-రే, స్కానింగ్ రిపోర్టులు చూసి వైద్యులు కంగుతిన్నారు. ఎండోస్కోపీ ద్వారా బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ.. భారీ సంఖ్యలో ఉండటంతో సాధ్యపడలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేసి 29 స్పూన్‌లు, 19 బ్రష్‌లతోపాటు రెండు పెన్నులనూ బయటకు తీశారు. ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని, మానసిక సమస్యలు ఎదుర్కొనే వాళ్లే ఇలా ప్రవర్తిస్తారని స్థానిక వైద్యులు వెల్లడించారు.
Also Read : CM Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు నో చెప్పిన విప్రో చైర్మెన్ ప్రేమ్‌జీ
