Rajiv Pratap Rudy: విమానంలో కో పైలట్‌ గా బీజేపీ ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ

విమానంలో కో పైలట్‌ గా బీజేపీ ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ

Rajiv Pratap Rudy : ఎప్పుడూ ప్రజా సేవలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ… తమలో ఉన్న ప్రతిభకు కొంత సమయం కేటాయిస్తుంటారు. తాజాగా బిహార్ కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ (Rajiv Pratap Rudy) కో పైలట్‌గా మారారు. ఈ నేపథ్యంలో రూడీని ప్రశంసిస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌ అవుతుంది.

Rajiv Pratap Rudy – అసలేం జరిగిందంటే ?

పట్నా నుంచి దిల్లీకి వెళ్లే విమానంలో చౌహాన్‌ ప్రయాణించారు. ఈ క్రమంలో విమానంలో కో పైలట్‌ గా ఉన్న రూడీని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించి చౌహాన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘రాజీవ్‌ ఈ రోజు మీరు మా హృదయాలను గెలుచుకున్నారు. పట్నా నుంచి దిల్లీకి వెళ్లే ఈ ప్రయాణం నాకు మరవలేనిది. ఎందుకంటే ఈ విమానానికి నా ప్రియమైన స్నేహితుడు, ఛప్రా ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ కో పైలట్‌గా ఉన్నారు’ అని రాసుకొచ్చారు.

దీనికి విమానంలో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్న ఫొటోలతో పాటు రూడీని ప్రశంసిస్తూ చేతితో రాసిన లేఖను కూడా చౌహాన్‌ పంచుకున్నారు. అందులో రూడీపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదని, బిజీ షెడ్యూల్‌లు ఉన్నప్పటికీ… తమలో ఉన్న ప్రతిభ కోసం సమయం కేటాయిస్తారన్నారు. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చినందుకు రూడీకి చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక, బిహార్‌ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన రూడీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

Also Read : CRPF: మావోల కంచుకోట బస్తర్‌ లో 10వేల రేడియో సెట్‌లు పంపిణీ

Leave A Reply

Your Email Id will not be published!