Minister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డి

వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం - కిషన్‌రెడ్డి

Minister Kishanreddy : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘‘ కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి (Minister Kishanreddy) ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలడు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు. మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయాం. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడ… బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

Minister Kishanreddy Key Comments

సుప్రీంకోర్టులో… రిజర్వేషన్లకు 50శాతం క్యాప్‌ పెట్టిందే కాంగ్రెస్‌ ప్రభుత్వం హాయంలోనే. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 50శాతం క్యాప్‌నకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడంలో విఫలమైంది. ఇప్పుడు హైకోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం. బీసీ రిజర్వేషన్ల కోసం భాజపా పూర్తి మద్దతు ఉంటుంది. జూబ్లీహిల్స్‌ అభ్యర్థి కోసం 3 పేర్లను జాతీయ పార్టీకి పంపించాం. పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌ తర్వాత అభ్యర్థి ప్రకటన ఉటుంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌.కృష్ణయ్య

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఏర్పాటు చేశారు. జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌.కృష్ణయ్య, వైస్‌ ఛైర్మన్‌గా వీజీ నారగోని వ్యవహరించనున్నారు. బీసీ జేఏసీలో ముఖ్యమైన ఆరుగురితో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ఉద్యమం బలంగా జరిగితే.. కేంద్రంపై ప్రభావం పడుతుందని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లలో ఏ అంశం మీద కోర్టు స్టే ఇచ్చిందని కృష్ణయ్య ప్రశ్నించారు. ‘‘ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక స్టే ఇవ్వకూడదు. బీసీలకు న్యాయం కోసం ఈ నెల 18న బంద్‌కు పిలుపునిచ్చాం. అన్యాయాన్ని 76 ఏళ్లుగా బీసీలు భరిస్తూ వస్తున్నారు. బీసీలకు అన్యాయంతోపాటు ఇప్పుడు అవమానం జరిగింది. చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం’’ అని కృష్ణయ్య పిలుపునిచ్చారు.

Also Read : P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!