రేవంత్ రెడ్డీ నువ్వు సీఎంవా స్ట్రీట్ రౌడీవా?

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. రోజు రోజుకు నోటికి అడ్డు అదుపు లేకుండా పోతోంద‌ని మండిప‌డ్డా. గ‌ల్లీ లీడ‌ర్ కంటే అధ్వాన్నంగా సీఎం త‌యర‌య్యాడ‌ని మండిప‌డ్డారు. అస‌లు రేవంత్ రెడ్డీ నువ్వు సీఎంవా లేక స్ట్రీట్ రౌడీవా అంత‌కంటే అధ్వాన్నంగా ఉన్నావంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఇవాళ హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కాబట్టే నువ్వు ఇయ్యాల ముఖ్యమంత్రి అయ్యావని, ఆ సంగ‌తి మ‌రిచి పోయి నోరు పారేసుకుంటే తెలంగాణ స‌మాజం ఊరుకోద‌ని హెచ్చ‌రించారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తూ నీ గురువు చంద్ర‌బాబు నాయుడు చెప్పు చేతుల్లో న‌డుచుకుంటూ పాల‌న సాగిస్తున్న నీకు మాట్లాడే హ‌క్కు లేద‌న్నారు . ఈ విష‌యం నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకానికి అర్థ‌మై ఉంటుంద‌న్నారు.

రేవంత్ రెడ్డి ఎన్నడన్నా జై తెలంగాణ అంటే కేసీఆర్ విలువ అర్థమయ్యేదని అన్నారు హ‌రీశ్ రావు.
మిర్యాలగూడలో నోటికొచ్చినట్లు పద్ధతి లేకుండా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌న‌ను చూసి స‌భ్య స‌మాజం సిగ్గుప‌డుతోంద‌ని పేర్కొన్నారు మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే, వాళ్లే నీ పేగులు తీసి మెడలో వేసుకుంటారని హెచ్చ‌రించారు. నీకు తెలంగాణ కష్టాలు తెల్వదు అందుకే తెలంగాణ కోసం పోరాడిన వాళ్లంటే నీకు లెక్క లేద‌న్నారు . రోజు రోజుకు నీ ఆగ‌డాలు ఎక్కువై పోయాయ‌ని, ఏదో ఒక రోజు జ‌నం చేతిలో చావు దెబ్బ త‌ప్ప‌ద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!