హైదరాబాద్: ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ బ్రాండ్ ‘హబీబ్స్’ సరికొత్త ప్రీమియం సెలూన్ శాఖ హైదరాబాద్ లోని చందానగర్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమీన్‌పూర్ రోడ్, సురక్ష కాలనీ, పద్మజానగర్‌లోని సంజీవని డయాగ్నోస్టిక్స్ సెంటర్ పై అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ నూతన సెలూన్ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి హిమజ విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి సెలూన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి హిమజ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవనశైలికి ఆకర్షణీయమైన రూపాన్ని అందించడంలో బ్యూటీ సెలూన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. దేశంలోని పట్టణ మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాల వారికి అందం, అలంకరణ రంగంలో సేవలు అందిస్తున్న హబీబ్స్ సెలూన్ బ్రాండ్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. అధునాతన వసతులు, అనుభవజ్ఞులైన సిబ్బందితో ఈ సెలూన్ నగర వాసులకు అత్యుత్తమ సేవలు అందిస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తపరిచారు.
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ బాచుపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘హబీబ్స్’ న్యూ ప్రీమియం సెలూన్ స్థానికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. బ్యూటీ అండ్ హెయిర్ కేర్ రంగంలో కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టు కోవాలని కోరారు. ఈ కొత్త ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్రాంచైజీ యజమానులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నగరం అంతటా బ్రాంచీలతో విస్తరిస్తున్న హబీబ్స్ ఫ్యామిలీకి నా శుభాకాంక్షలు’ అని అన్నారు.