అంతటా నిశ్శబ్దం..ఇసుక వేస్తే రాలనంత జనం. చిన్నా పెద్దా తేడా అంటూ లేకుండా వేలాది మంది వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఎందుకోసమని అనుకుంటున్నారా. అతడే పంజాబ్ కు చెందిన గాయకుడు దిల్జిత్ దొసాంజిత్ ఒక్కసారిగా స్టేజిపైకి రాగానే పెద్ద పెట్టున అరుపులు..కేకలు..లవ్ యూ దిల్జిత్ ..దా..అంటూ కేరింతలు. సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ లో ఈ సింగర్ మోస్ట్ పాపులర్. ఆ గాత్రంలో చిలిపితనం మిలితమై వుంది. అతను పాడితే చాలు నిశీధిని వెలుగు కమ్మేస్తుంది. గుండెలన్నీ లబ్ డబ్ అంటూ కొట్టుకుంటాయి. ప్రాణం పోతుందేమోనంత టెన్షన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వయసు 36 కానీ మనసు పదహారే. ఒక్కసారి స్టార్ట్ చేస్తే చాలు శరీరాలు అదుపు తప్పిపోతాయి.
మనసులు లయ తప్పుతాయి. కళ్లు విప్పారిపోతాయి. తీయని పెదవుల మీద నవ్వులు వాలిపోతాయి. కొమ్మలు కదలాడినట్లు..గాలి చెంపలను గోముగా నిమిరినట్లు అయిపోతుంది. ఎంతలా అంటే ..మనమూ అతడితో గంతులేస్తాం. మనలోకి తెలియకుండానే లోలోపటికి చేర్చుకుంటాం. అంత మహత్తు..విద్వత్తు దిల్జిత్ ది. పుట్టుకతో పంజాబీ అయినా హిందీ లో సైతం తన గాత్రంతో ఆకట్టుకుంటున్నాడు. మనోడు సింగర్ తో పాటు నటుడు కూడా. అతను నటించిన సినిమాలు సక్సెస్ ఫుల్ గా నడిచాయి. వీటిలో 10కి పైగా మూవీస్ హిట్ పెయిర్ గా నిలిచాయి. 2016లో ఉడ్తా పంజాబ్ కు గాను ఫిలిం ఫేర్ అవార్డు వరించింది. 2019లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నిలిచారు. బిల్ బోర్డు ప్రకటించిన 50 మందిలో దిల్జిత్ రైజింగ్ స్టార్ గా ఎంపికయ్యాడు. కెనెడియన్ ఆల్బమ్ చార్ట్ లో 11వ స్థానంలో నిలిచాడు.
అతడి మ్యూజిక్ కెరీర్ 2004లో ఊపందుకుంది. ఇష్ దా ఉదా దిల్ పేరుతో పాటల ఆల్బమ్ రూపొందించాడు. రాజిందర్ సింగ్ దిల్జిత్ కు ఆర్థిక సహకారం అందించాడు. అతడి సాయంతో తన గాత్రానికి మెరుగులు దిద్దాడు. బబ్లూ మహిందర్ సంగీతం అందిస్తే బల్విర్ బూపారాయి పాటలు రాశాడు. దిల్ పేరుతో రెండో ఆల్బమ్ విడుదల చేశాడు. వందలాది పాటలు అతడి స్వరంలోంచి జాలు వారాయి. స్మైల్, ఇష్ హో గయా , చాక్లెట్, ద నెక్స్ట్ లెవల్, సిఖ్ జేసిఎల్ సింగ్, బ్యాక్ టూ బేసిక్, కాన్ఫిడెన్షియల్, రోర్, గోట్ పేరుతో విడుదలై హిట్ టాక్ అందుకున్నాయి. పంజాబీ మూవీస్ లో గీతాలు పాడాడు. ధాత్రి వారంట్, ద లయన్ ఆఫ్ పంజాబ్, జిహ్నే మేరా దిల్ లూటేయా, షాదీ లవ్ స్టోరీ ..ఆజా భాంగ్రా పా లైయే..లాల్తైన్ నాచ్ది, షాదా , ఎక్స్పెన్షివ్, మెహందీ, మెహఫిల్, మోర్ దుమ్ము రేపాయి.
2012లో తేరే నాల్ లవ్ హో గయా..మేరే డాడ్ కి మారుతీ, యమ్లా పగ్లా దీవానా 2 , అయిదాన్ హి నాచ్నా, సింగ్ ఈజ్ బ్లింగ్ టుంగ్ టుంగ్ బాజే, ఉడ్తా పంజాబ్ ఇక్ కుడి , నాటీ బిల్లో, దమ్ దమ్ , మూవ్ యుర్ లక్, సద్దా మూవ్, రౌలా, ఇష్క్ ది బాజియా, పంత్ మే గన్, ప్రాపర్ పటోలా, దిల్ తోడేయా, సౌదా ఖారా ఖారా పాటలు ప్రపంచాన్ని ఊపేశాయి. 2009లో ద పవర్ ఆఫ్ డ్యూయట్స్ ..నాచ్ది దే ఫిట్ మిస్ పూజా, భగత్ సింగ్, డాన్స్ విత్ మీ ఒక్కసారిగా దిల్జిత్ ను టాప్ రేంజ్ లో నిలిపేలా చేశాయి. ఇలా చెప్పుకుంటూ వందలాది గీతాలు చాలా ఉన్నాయి. చెప్పలేనంతగా. దిల్జిత్ ఒరలో లెక్కలేనన్ని ..లెక్కించలేనన్ని అవార్డులు, పురస్కారాలు ఎన్నో. చెప్పుకుంటూ పోతే ఓ వారం రోజులు పడుతుంది. డాన్స్ విత్ మి అంటూ అందరితో పాటు అమాయకుడిలా..ప్రేమికుడిలా..గుండె నిండుగా పాడుతూ వుంటే లక్షలాది గుండెలు ఎందుకు కదలకుండా ఉంటాయి. ఏది ఏమైనా..ఇలాంటి స్వర మాంత్రికుడి కాలంలో మనమూ ఉన్నందుకు ఆనందపడాలి. ఇంతకు మించి రాస్తే అతడిని తక్కువ చేసిన వారమవుతాం. గాత్రం గాంధర్వం అంటే ఇదేనేమో..దిల్జిత్ వుయ్ లవ్ యూ..ఫర్ ఎవెర్.
Breaking
- Jharkhand CM : జార్ఖండ్ గవర్నర్ తో భేటీ అయిన జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్
- Uttar Pradesh : యువతిని హత్య చేసిన ముగ్గురిపై పోలీసులు కాల్పులు
- Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స
- Bandi Sanjay : ఢిల్లీకి పైసలు పంపడానికే ఈ హైడ్రా : కేంద్రమంత్రి బండి సంజయ్
- CM Chandrababu: ఈ నేల 4లోగా వరద బాధితుల ఖాతాల్లో రూ.602 కోట్ల పరిహారం జమ కావాల్సిందే: సీఎం చంద్రబాబు ఆదేశం
- Ap New Liquor Shops : ప్రైవేట్ మద్యం దుకాణలకు ఎక్సైజ్ శాఖ నొటిఫికేషన్
- Siddaramaiah : సిద్ధరామయ్యకు ఈడీ బిగ్ షాక్
- Udaipur: ఆ గ్రామల్లో హడలెత్తిస్తున్న చిరుత.. 11 రోజుల్లో ఏడుగురిపై దాడి, మృతి
- MP Aravind : రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది – బీజేపీ ఎంపీ అరవింద్
- MLA K Srinivasa Rao: తిరువూరును రక్షించండి ఎమ్మెల్యే కొలికపూడి మాకొద్దు ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు
No comment allowed please