#Samantha: ఫ్రిబ‌వ‌రి 12 నుంచి స‌మంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిర‌స్

Samantha : ప్ర‌ముఖ ప్ర‌ఖ్యాత ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతున్న ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే,

Samantha : ప్ర‌ముఖ ప్ర‌ఖ్యాత ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతున్న ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే, అయితే ఈ వెబ్ సిరీస్ నుంచి సీజ‌న్ 2 రాబోతుంద‌ని ఎప్ప‌టినుంచో చెబుతున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తాజాగా దీనికి సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఫ్యామిలీ మేజ్ సీజ‌న్ 2 ఫిబ్ర‌వ‌రి 12, 2021 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వ‌నుంది, ఈ లేటెస్ట్ సీజ‌న్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha) ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించ‌డం విశేషం, అలానే ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయ్, ప్రియ‌మ‌ణి త‌దిత‌రులు ఈ వెబ్ సిరీస్ లో న‌టిస్తున్నారు. ఫ్యామిలీ మేన్ సీజ‌న్ 1 కి దేశ‌వ్యాప్తంగా అనూహ్య స్పంద‌న ల‌భించింది, ఇదే రీతిన ఫ్యామిలీ మేన్ 2కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంద‌ని, సీజ‌న్ 1కి మించిన ఎంట‌ర్ టైన్మెంట్, థ్లిల్లింగ్ ఎలిమెంట్స్ సీజ‌న్ 2 లో ఉండ‌బోతున్నాయ‌ని అమెజాన్ ప్రైమ్ వీడియో టీమ్ స‌భ్యులు తెలిపారు. హిందీతో పాటు, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఫ్యామిలీ మేన్ సీజ‌న్ 2 స్ట్రీమింగ్ అవ్వ‌నుంది.

No comment allowed please