#Energy : ఇంధన పొదుపుపై అవగాహన పెంచాల్సిందే

Energy : మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేసే పదార్ధాన్ని ఇంధనం అంటారు. ఇంధన వాడకం నిత్యకృత్యం. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఇలా ఇంధనం ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతున్నది.

Energy  : మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేసే పదార్ధాన్ని ఇంధనం అంటారు. ఇంధన వాడకం నిత్యకృత్యం. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఇలా ఇంధనం ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతున్నది.

ఇష్టారాజ్యంగా, ఇబ్బడి ముబ్బడిగా ఇంధన వనరుల వినియోగం భవిష్యత్ అవసరాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇంథన వనరుల రక్షణ అనివార్యంగా ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది. అవసరాలకు మించి వినియోగం చేస్తూ, పొడుపుపై అదుపు లేకుంటే భవిష్యత్తు అంధకారమే. అందుకే సంప్రదాయేతర ఇంధన వినియోగం ప్రత్యామ్నాయ మార్గంగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

శక్తి రహితంగా ఏ పనీ సాధ్యం కాదు. అందుకు తగిన సాధనం ఇంధనమే. మనకు తెలియ కుండానే మనం ప్రతిక్షణం ఎన్నోరకాల ఇంధనాలపై ఆధారపడి జీవిస్తున్నాం. మనం ఇంట్లో వాడుకునే లైటు, ఫ్యాను, టీవీ, సెల్‌ఫోన్‌, మిక్సీ, గ్రైండర్‌, పొయ్యి మొదలు రైలు, బస్సు, బైక్, విమానం, రాకెట్‌ ఇలా ప్రతీది ఇంధనంపై ఆధారపడే నడుస్తుంది. ఇంధనం లేకుండా ఒక్క క్షణం కూడా గడవదంటే అతిశయోక్తి కాదు. నీరు, పెట్రోల్‌, డీజిల్‌, బొగ్గు, విద్యుత్‌, కట్టెపుల్లలు సహా ఎన్నో రకాల ఘన, ద్రవ, వాయు ఇంధనాలు, యురేనియం, థోరియం వంటి అణు రసాయన ఇంధనాలు మనకు నిత్య జీవితంలో ఇంధనాలుగా ఉపయోగ పడుతున్నాయి. అలాంటి ఇంధనాలే లేకపోతే ముందు ముందు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. ఇబ్బడి ముబ్బడి ఇంధన వనరుల వినియోగం భవిష్య అవసరాలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంథన వనరుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది.

జనాభా రోజురోజుకూ భారీగా అడ్డూ అదుపూ లేకుండా పెరు గుతున్నది. జనాభా పెరుగుదలతో పాటే పెట్రోలు, డీజిల్‌, గ్యాసు, విద్యుత్‌ వంటి ఇంధన వనరుల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. రానురాను ఇంధనాలు సరిపోని క్లిష్టతర పరిస్థితులు రాబోతున్నాయి. ఒక రకంగా దేశ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే పారిశ్రామిక రంగ ప్రగతిని నిర్ధేశించేదేవే ఇంధన వనరులు. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశంగా మన దేశంలో ఇంధన వనరుల వినియోగం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. ఫలితంగా సంప్రదాయ ఇంధన వనరులు హరించుకు పోతున్నాయి. ఇలాంటి ఇంధన వనరులను రక్షించడమే నేడు ప్రధాన కర్తవ్యంగా మారింది.

సంప్రదాయ ఇంధన వనరులైన బొగ్గు, పెట్రోల్‌, డీజిల్‌, అణు ఇంధనాలు ప్రకృతిలో పరిమితంగా మాత్రమే లభిస్తాయి. వాటిని ప్రస్తుతం వినియోగిస్తున్నట్లుగా విపరీతంగా వినియోగిస్తే ప్రమాదం తప్పదు. ప్రస్తుతం మనం చేస్తున్న వృధా, భవిష్యత్తు తరాలకు అంధకారాన్ని మిగులుస్తుంది. దీనికి మనమే బాధ్యత వహించాలి. అందుకోసం సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన, టైడల్‌ (సముద్ర కెరటాలు) విద్యుత్‌ వనరులపై ఆధార పడాలి. పెట్రోల్‌ డీజిల్‌ గ్యాసులకు బదులుగా బయో ఇంధన వనరులను, బయోడీజిల్‌, బయో గ్యాస్‌ వంటి ఇంధన వనరులపై ఆధారపడడం వల్ల భవిష్యత్తు తరాలకు మేలు చేసినవారం అవుతామని ఇకనైనా గ్రహించాలి.

పునరుత్పాదక ఇంధన పథకాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో విశేష కృషి చేస్తున్నది. స్వచ్ఛమైన శిలాజ ఇంధనాలను, పర్యావరణ హితమైన ఇంధనాలను తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచుకోవడానికి, అవి అందుబాటు యోగ్యంగా ఉండేలా చూడటానికి ప్రాధాన్యం ఇస్తున్నది. దేశంలో సులభతర వాణిజ్య నిర్వహణకు ఎంతో చేయూత అందిస్తున్నది.

స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు సదుపాయంగా ఉండేలా, అన్ని మంత్రిత్వ శాఖల్లో ప్రాజెక్ట్ అభివృద్ధి విభాగాలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విభాగాలను ఏర్పాటు చేసింది. ఇంధన పేదరికాన్ని అంతం చేసే దిశగా, స్వచ్ఛమైన శిలాజ ఇంధనాలను, పర్యావరణ హితమైన ఇంధనాలను తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచుకోవడానికి మార్గ నిర్దేశం చేస్తున్నది. స్వచ్ఛందంగా శిలాజ ఇంధన వినియోగం, స్వదేశీ ఇంధనాలపై మరింత ఎక్కవగా ఆధారపడటం, విద్యుత్ సేవలను పెంచడం, తాజాగా ఆవిర్భవిస్తున్న హైడ్రోజన్ వంటి ఇంధనాలవైపు మరలడం, అన్ని ఇంధన వ్యవస్థల్లో డిజిటల్ సృజనాత్మక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం తదితర అంశాలపై ప్రభుత్వ దృష్టి కేంద్రీకృతమై ఉంది.

No comment allowed please