#BharathBioTech : పరిహారం ఇస్తామంటున్న భారత్ బయో టెక్
కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు అంగీకారం అఖ్కర్లేదు
Bharath BioTech : తమ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్టుకు గురైతే నష్ట పరిహారం చెల్లించేందుకు రెడీగా ఉన్నామంటోంది హైదరాబాద్ కు చెందిన భారత్ బయో టెక్ కంపెనీ. ఇప్పటికే అన్ని పరీక్షలు చేసి, రూఢీ అయ్యాక దేశ వ్యాప్తంగా సిరం ఇనిస్టిట్యూట్ తో పాటు బిబిటి కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ను రెండు విడతల వారీగా పంపిణీ చేస్తోంది. తమ మందు కారణంగానే ప్రతికూలతలు ఎదురైనట్లు పరిశోధనలో రుజువైతే వైద్య సహాయం కూడా అందజేస్తామని భారత్ బయో టెక్ తెలిపింది.
ఈ మేరకు టీకా వేసుకున్న తర్వాత అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో , ప్రభుత్వ ఆమోదం ఉన్న అధికారిక ఆస్పత్రుల్లో చికిత్స అందజేస్తామని ప్రకటించింది. ప్రధాన మంత్రి మోదీ ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో వైఎస్ జగన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఇక దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జినల టీకా డోసులను ఫ్రంట్ లైన్ వారియర్లకు అందజేస్తున్నారు. ఇక వ్యాక్సిన్ వేయించుకునే వారు అంగీకార పత్రం ఉంటేనే తెలంగాణలో భారత్ బయోటెక్ టీకా(Bharath BioTech) అందజేస్తామని ప్రజారోగ్య వైద్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు.
అయితే ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు మాత్రం ఎలాంటి అంగీకార పత్రం అవసరం లేదని తెలిపారు. దేశంలో మొదటి విడతగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనుండగా రెండో విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు. ప్రపంచంలో ఇండియా కరోనాను కట్టడి చేయడంలో టాప్ పొజిషన్లో ఉంది. ఇక అమెరికా ఇపుడు కంట్రోల్ చేయలేక తంటాలు పడుతోంది.
No comment allowed please