#ChinnaJeeyarTrust : వెలుగులు పంచుతున్న జీయ‌ర్ ట్ర‌స్ట్

సామాజిక సేవ‌లో జీవా ముందంజ‌

Chinna Jeeyar Trust : 53 ఎకరాల సువిశాలమైన ప్రాంగణం . అదే జీవా.. జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక అకాడెమీ ని స్వామీజీ ఏర్పాటు చేసారు . ఇందులో దివ్య సాకేతం, వేదాంత పాఠశాల , నేత్ర విద్యాలయ జూనియర్ , డిగ్రీ కాలేజీలు , గోశాల , జిమ్స్ హాస్పిటల్ , హోమియో మెడికల్ కాలేజీలు ఉన్నాయి . 2009 జూన్ లో దివ్య సంకేతం ప్రారంభమైంది . కుల మతాలకు అతీతంగా గురుకులం విజయవంతంగా నడుస్తోంది . అరుదైన దేశీవాళి గోవులు , దూడల సంరక్షణ తో పాటు గో ఉత్పత్తుల తయారీ జరుగుతోంది . పలు వ్యాధులకు ఇక్కడ మందులు లభిస్తాయి . ఇదే ఇక్కడి ప్రత్యేకత . ఇక జిమ్స్ లో అందరికీ అందుబాటులో హోమియో , ఆయుర్వేద , అల్లోపతి వైద్యం అందుబాటులో ఉంది.

విశ్వశాంతి కోసం గీతామృత దీక్ష స్వామిజీ చేపట్టారు . 700 బృందాలు , ఏక కాలంలో అమెరికాలోని 18 రాష్ట్రాలు , దేశంలోని 3 రాష్ట్రాల్లో పారాయణం చేపట్టారు . ఇందులో లక్షలాది మంది భక్తులు పాలు పంచుకున్నారు . వెలుగులు పంచుతున్న గీతా జ్యోతి . స్వీయ ఆరాధన సర్వ ఆదరణ నినాదంతో 17 వేల గ్రామాల ను చైతన్యవంతం చేశారు . సామూహిక ప్రతిజ్ఞలు చేశారు . ఇదంతా స్వామీజీ ఆధ్వర్యంలో నిరాటంకంగా కొనసాగింది . 2002 లో చరిత్రలో మొట్టమొదటి సారి మానస సరోవర తీరాన స్వామిజీ బ్రహ్మ యజ్ఞాన్ని నిర్వహించారు . మెగా పశు వైద్య శిబిరాలు చేపట్టారు . ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా పశువులకు వైద్యం అందేలా చేశారు .

యువతీ యువకులు వారి కాళ్ళమీద వారు నిలబడేలా ఆదిలాబాద్ జిల్లాలో శిక్షణ ఇప్పించారు . సైకిళ్ళు , మైకులు , కెమెరాలు , ఇతర సామాగ్రిని అందచేశారు . వేదాగమ పాఠశాల 1982 లో ప్రారంభించారు . 2000 మందికి పైగా వేదాలపై పట్టు సాధించారు . ఆత్మవలోకనం పేరుతో అర్చకులందరినీ ఏకతాటిపైకి స్వామిజీ తీసుకు వచ్చారు . అఖిల భారత అర్చక మహా సదస్సు విజయవంతమైంది . క్యాన్సర్ , అంధత్వ , అవయవ దాన అవగాహన సదస్సులు చేపట్టారు . ఉచితంగా గిరిజన పాఠశాలలను స్వామిజీ ఏర్పాటు చేశారు .

అల్లపల్లి , బీర్సాయిపేట , కఠారివారిపాలెం , నేత్ర విద్యాలయం , అంధులకు ఉచితంగా సాంకేతిక విద్య తో పాటు ఉపాధి అందేలా కృషి చేశారు . విశాఖ వారిజలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల , శ్రీరామనగరంలో జూనియర్ కాలేజీ , డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసారు . నడిగడ్డపాలెం లో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు . 5 లక్షల కు పైగా మొక్కలు నాటారు . ఆరోగ్య శిబిరాల ద్వారా 35 లక్షలకు పైగా లబ్ది పొందారు . ఇది కూడా ఓ చరిత్రే. వేద విద్య వ్యాప్తిలో విశేషంగా కృషి చేసిన వారికి 1996 నుండి పలువురికి పురస్కారాలను స్వామీజీ అందించారు .

నీటి కొరత తీర్చేందుకు పాడేరులో మూడు వాటర్ ప్లాంట్లు , ఎల్లంపల్లి , బీర్సాయిపేట , కరీంనగర్ , గొల్లపాలెం, సీతానగరం , పోతేపల్లి , శ్రీరామనగరం , వెలిచాల, శంషాబాద్ లలో నీటి పథకాలు ఏర్పాటు చేశారు . కృష్ణం వన్డే జగత్గురుమ్ పేరుతో సామూహిక ప్రార్థన నిర్వహించారు .మనం బాగుంటే చాలు ..ఇంకొకరితో మనకెందుకు అనుకునే ఈ సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం మనం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి . డబ్బులుంటే చాలు అదే లోకమని భ్రమల్లో బతుకుతున్న వారికి స్వామీజీ చేస్తున్న ఈ నిస్వార్థ సేవ కార్యక్రమాలు స్ఫూర్తి కావాలి .

దీన జనోద్ధరణ , సమాజ సేవే పరమావధిగా సాగిపోతున్న స్వామిజీ కాలంలో మనమూ బతికి ఉన్నందుకు గర్వపడాలి . అందుకే సర్వసంగ పరిత్యాగి అయిన చినజీయర్ స్వామిజీ ని ఒక్కసారి దర్శించుకోండి . మీకు మీరు అర్థమవుతారు . తోటి వారి పట్ల దయ కలిగి ఉండేలా మారి పోతారు . ఆయన వరాలు కురిపించే దేవుడు కాకపోవొచ్చు ..కానీ అశేష భక్త జనకోటికి మాత్రం ఆయన దివ్య జ్యోతి . భక్తుల బాంధవుడు .నడిచే నారాయణుడు…కాదంటారా ..!

No comment allowed please