ENG U19 vs AFG U19 : ఇంగ్లండ్ సెన్సేష‌న్ ఆఫ్గాన్ ప‌రేషాన్

24 ఏళ్ల త‌ర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు

ENG U19 vs AFG U19 : ఇంగ్లండ్ కు చెందిన యువ ఆట‌గాళ్లు చ‌రిత్ర సృష్టించారు. వెస్టిండీస్ వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో 24 ఏళ్ల త‌ర్వాత ఫైన‌ల్ కు చేరుకు ఇంగ్లండ్.

ఆఫ్గ‌నిస్తాన్ తో అత్యంత ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో ఓడించి విస్తు పోయేలా చేసింది. అంటిగ్వా మైదానంలో జ‌రిగిన మ్యాచ్ లో ఆద్యంతం నువ్వా నేనా అన్న రీతిలో సాగింది.

సుదీర్ఘ కాలానికి తెర దించింది. స్కిప్ప‌ర్ టామ్ ప్రెస్ట్ నాయ‌క‌త్వంలోని యువ జ‌ట్టు అద్భుతం చేసింది. త‌మ అభిమానుల‌కు కోలుకోలేని రీతిలో సంతోషాన్ని మిగిల్చేలా చేసింది.

మొద‌ట ఇంగ్లండ్ కెప్టెన్ ప్రెస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 47 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 231 ప‌రుగులు సాధించింది. జ‌ట్టు ఓపెన‌ర్ జార్జ్ థామ‌స్ హాఫ్ సెంచ‌రితో మెరిసాడు.

సీనియ‌ర్ల‌ను త‌ల‌పించేలా మ‌రో ఆట‌గాడు జార్గ్ బెల్ 56 ర‌న్స్ తో దుమ్మ‌రేపాడు. ఇంకో వైపు వికెట్ కీప‌ర్ అలెక్స్ హార్ట‌న్ 53 ప‌రుగులు చేసి కీల‌క పాత్ర పోషించాడు.

ఈ త‌రుణంలో 232 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఆఫ్గ‌నిస్తాన్ చివ‌రి దాకా పోరాటం సాగించింది. చివ‌రి దాకా ఫైట్ చేసింది. 47 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 215 ర‌న్స్ మాత్ర‌మే చేసి చేతులెత్తేసింది.

దీంతో ఇంగ్లండ్ జ‌ట్టు 15 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. ఇదిలా ఉండ‌గా వ‌ర‌ల్డ్ క‌ప్(ENG U19 vs AFG U19) లో 50 ఓవ‌ర్లు ఆడాల్సి ఉండ‌గా వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది.

దీంతో డీఎల్ఎస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం మ్యాచ్ ను 47 ఓవ‌ర్ల‌కే కుదించారు. ఇంగ్లండ్ ప్లేయ‌ర్ బెల్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

Also Read : నిన్న ఇంగ్లండ్ నేడు భార‌త్ వంతు

Leave A Reply

Your Email Id will not be published!