Team India : వెంటాడుతున్న క‌రోనా మ్యాచ్ జ‌రిగేనా

ఎనిమిది మంది ఆటగాళ్ల‌కు క‌రోనా పాజిటివ్

Team India : టీమిండియాకు బిగ్ షాక్ త‌గిలింది. క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప‌లువురు భార‌త ఆటగాళ్ల‌కు పాజిటివ్ సోకిన‌ట్లు తేలింది. దీంతో ఈనెల 6న అహ్మ‌దాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జ‌ర‌గాల్సిన మ్యాచ్ ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది.

ఇప్ప‌టికే స్టార్ ప్లేయ‌ర్లు శిఖ‌ర్ ధ‌వ‌న్ , శ్రేయ‌స్ అయ్యార్, రుతురాజ్ గైక్వాడ్ తో పాటు మ‌రో ఐదు మంది ప్ర‌ధాన ఆట‌గాళ్ల‌కు క‌రోనా సోకింది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ఉన్న ఆట‌గాళ్ల‌లో ఇంకొంద‌రికి గ‌నుక క‌రోనా అటాక్ అయితే ఇక మ్యాచ్ పూర్తిగా నిర్వ‌హించే ప‌రిస్థితి ఉండ‌దు. దీనిపై భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ పున‌రాలోచ‌న‌లో ప‌డింది.

ఇప్ప‌టికే టీమిండియా(Team India) సౌతాఫ్రికా టూర్ లో భాగంగా భార‌త జ‌ట్టు మూడు వ‌న్డేల‌లో చేతులెత్తేసింది. ఇక ఒక టెస్టు మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్ ల‌లో ఘోర ప‌రాజాయాన్ని మూట‌గ‌ట్టుకుంది.

ఆ త‌ర్వాత స్వ‌దేశంలో జ‌రిగే విండీస్ టూర్ కు రెడీ అయ్యింది. ఈ మేర‌కు మూడు వ‌న్డీ, టీ20 సీరీస్ ఆడాల్సి ఉంది. విండీస్ తో ఆడాక స్వ‌దేశంలో శ్రీ‌లంక ప‌ర్య‌టించ‌నుంది.

ఆ జ‌ట్టు ఇప్ప‌టికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టీంలోని స‌భ్యులంతా క‌రోనా దెబ్బ‌కు మ్యాచ్ ప్రాక్టీస్ సెష‌న్ కు గుడ్ బై చెప్పారు. అంతా ఐసోలేష‌న్ లోనే ఉండి పోయారు.

ఇవాళ జ‌రగాల్సిన ప్రాక్టీస్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది బీసీసీఐ. ప‌లువురు ఆట‌గాళ్లకు క‌రోనా సోక‌డంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా కొంద‌రి ఆట‌గాళ్ల‌ను రిజ‌ర్వ్ లో పెట్టింది. మ‌నీష్ పాండేను ఇప్ప‌టికే చేర్చింది.

Also Read : ఐపీఎల్ వేలంలో అత‌డే రైజింగ్ స్టార్

Leave A Reply

Your Email Id will not be published!