Khiladi Movie : మాస్ మ‌హ‌రాజా ఖిలాడి కిర్రాక్

ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

Khiladi Movie :  టాలీవుడ్ లో మాస్ మ‌హ‌రాజాగా పేరొందిన ర‌వితేజ ఏది చేసినా అది ఓ సెన్సేష‌న్. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మూవీ ఇచ్చిన స‌క్సెస్ కిక్కుతో మ‌రోసారి త‌న స‌త్తా చాటాడు ఖిలాడీ (Khiladi Movie)మూవీతో.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉంది ఈ మూవీ. ఇక చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇంకోసారి త‌న డైలాగ్ డెలివ‌రీ మార్క్ చూపించాడు.

ప‌వ‌ర్ ఫుల్ పంచ్ ల‌తో ఆక‌ట్టుకునేలా ఉంది ఈ ట్రైల‌ర్ చూస్తే. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. భారీ బ‌డ్జెట్ తో కొనేరు స‌త్య నారాయ‌ణ నిర్మించాడు.

ఇప్ప‌టికే రిలీజ్ చేసిన సింగిల్స్ కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఖిలాడిలో కావాల్సిన మ‌సాలా కూడా ద‌ట్టించి వ‌దిలాడు ర‌మేశ్ వ‌ర్మ‌. ఇందులో ర‌వితేజ‌, హీరోయిన్ మ‌ధ్య లిప్ లాక్ కూడా ఉంది.

యూత్ కు కిక్కు ఎక్కించే సీన్ అన్న మాట‌. ఈ మ‌ధ్య‌న తెలుగు సినిమాల్లో ఇవీ మ‌రీ ఎక్కువై పోయాయి. ఇక ఓటీటీలు హ‌ద్దులు దాటి పోయాయి.

మీనాక్షి చౌద‌రి, డింపుల్ తో పాటు రంగ‌మ్మ‌త్త‌గా పేరొందిన అన‌సూయ కూడా ఇందులో న‌టిస్తోంది. ఇక యాక్ష‌న్, రొమాన్స్ , కామెడీతో మాస్ సాంగ్స్ అద‌ర‌గొట్టేలా ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన సాంగ్ దుమ్ము రేపుతోంది సోష‌ల్ మీడియాను.

ఇప్ప‌టికే దుమ్ము రేపుతున్న ఈ మూవీ విడుద‌లైతే ఇంకెన్ని వ‌సూళ్లు చేస్తుందో చూడాలి.

Also Read : 50 రోజుల్లో రానున్న జ‌క్క‌న్న మూవీ

Leave A Reply

Your Email Id will not be published!