Beqaaboo Song : నెట్టింట్లో ‘బేకాబూ’ సాంగ్ హ‌ల్ చ‌ల్

అమెజాన్ ప్రైమ్ లో గెహ్ర‌రియాన్ విడుద‌ల

Beqaaboo Song  : క‌రుణ్ జోహార్ నిర్మించిన గెహ్ర‌యాన్ అమెజాన్ ప్రైమ్ లో విడుద‌లైంది. ఇప్ప‌టికే దీనిపై పెద్ద ఎత్తున అంచ‌నాలు ఉన్నాయి. శ‌కున్ బాత్రా దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టైటిట్ ట్రాక్ డూబే పాట ఆద‌ర‌ణ చూర‌గొంది. గాత్రం, సాహిత్యం, సంగీతానికి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తాజాగా దీపికా ప‌దుకొనే సిద్దాంత్ చ‌తుర్వేదితో రొమాన్స్ చేస్తున్న బేకాబూ ట్రాక్ వీడియో(Beqaaboo Song )దుమ్ము రేపుతోంది.

నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య క‌లిగే ప్రేమ‌ను వ్య‌క్తం చేసేలా ఉండేలా సాంగ్ రూపొందించాడు ద‌ర్శ‌కుడు. కుటుంబంలో భావోద్వేగాలు ఎలా ఉంటాయ‌నే దాని క‌థాంశం ఆధారంగా డైరెక్ట‌ర్ తెర‌కెక్కించాడు.

స‌వేరా, ష‌ల్మాలి ఖోల్ గాడే పాడారు. కౌస‌ర్ మునీర్ బేకాబూ (Beqaaboo Song )పాట‌ను రశాడు. అనుభూతిని ఇచ్చేలా యూత్ కు పిచ్చెక్కించేలా తీశాడు. ఇక ప్రేమికులుగా ఇద్ద‌రూ పంట పండించారు.

ఒక‌రినొక‌రు స‌మ‌యం గ‌డ‌ప‌డం, ప్రేమ‌లో ప‌డ‌టం ఉండేలా లీన‌మ‌య్యారు. మిగ‌తా పాట‌ల కంటే ఈ సాంగ్ ను మ‌రింత రిచ్ గా ఉండేలా చేశాడు. బీచ్, స‌ముద్రంలో తీసిన లొకేష‌న్స్ బాగా ఆక‌ట్టుకునేలా ఉంది ఈ సాంగ్.

వాస్త‌వ ప్రపంచం నుంచి త‌ప్పించు కోవాలంటే ఈ సాంగ్ ను ఆశ్ర‌యించాల్సిందే అంటారు ద‌ర్శ‌కుడు. గెహ్రాయాన్ కోసం శ‌కున్ బాత్రా సంగీతం అందించేందుకు చాన్స్ ఇచ్చాడ‌ని చెప్పాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ క‌బీర్ క‌థ్పాలియా.

క‌థ‌కు త‌గ్గ‌ట్టు మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంద‌ని తెలిపాడు. గెహ్రాయాన్ మూవీని బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మించారు.

Also Read : నెట్టింట్లో ‘బ‌ధాయి దో’ హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!