#RadhammaKuthuru : దుమ్ము రేపుతున్న రాధమ్మ కూతురు రేవంత్ సాంగ్
మనసు దోచేస్తున్న రాధే రాధే నీ బాధే సాంగ్
Radhamma Kuthuru : తెలుగు బుల్లితెర మీద జీ తెలుగు కు ఓ ఇమేజ్ ఉన్నది. సీరియల్స్ తో పాటు వినోదాన్ని అందించడంలో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. స్టార్ టీవీ తెలుగులోకి ఎంటర్ అయ్యింది. దీంతో స్టార్ , జీ తెలుగు ఛానల్స్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. స్టార్ గ్రూప్ నకు ఉదయ్ శంకర్ ఎప్పుడైతే సీయీవోగా వచ్చాడో ఇక దాని స్వరూపాన్ని మార్చేశాడు.
ఏకంగా రీజినల్ లంగ్యేజ్ లలోకి స్టార్ ను ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రతి ప్రోగ్రాం ను ఆయా ప్రాంతాలకు , నేటివిటీకి దగ్గరగా ఉండేలా చూశాడు. ఇంకేం తెలుగులో మాటీవీని కొనుగోలు చేశాడు. ఇక్కడ టాప్ రేంజ్ లో ఉన్న జీ తెలుగు కు గట్టి పోటీ ఇప్పుడు మా ఇస్తోంది. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ను తీసుకు వస్తూ జనాన్ని ఎంటర్ టైన్ చేసే పనిలో పడింది.
బిగ్ బాస్ , అగ్ని సాక్షి, కార్తీక దీపం స్టార్ మా టీవీని ఆదరించేలా చేస్తున్నాయి. మా టీవీని తట్టుకునేందుకు జీ తెలుగు కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. తాజగా నిన్నే పెళ్లాడుతా సీరియల్ స్థానంలో కొత్తగా రాధమ్మ కూతురు సీరియల్ ను ప్రారంభించింది. ఈ సీరియల్ కోసం రూపొందించిన అందే అందే చేతులే ఆకాశానికి.. అన్న టైటిల్ సాంగ్ రికార్డ్ బ్రేక్ చేస్తోంది.
ఇండియన్ ఐడల్ ఎల్. వి. రేవంత్ గుండెల్ని హత్తుకునేలా పాడాడు. యూట్యూబ్ లో రోజు రోజు కు దీనిని చూసే వాళ్ళు ఎక్కువవుతున్నారు. ఇప్పటి వరకు లక్షల మందికి పైగా ఈ సాంగ్ ను చూశారు..విన్నారు..ఇంకా వింటూనే ఉన్నారు. ఈ పాటకు మీనాక్షి భుజంగ్ సంగీత దర్శకత్వం వహిస్తే , సాగర్ నారాయణ ముక్కు..ఈ సాంగ్ ను మనసుకు హత్తుకునేలా రాశారు.
ఇప్పటికే టాప్ రేంజ్ సింగర్ గా ఉన్న రేవంత్ పాటకు ప్రాణం పోశాడు. రాధమ్మ పడే కష్టాలు, చివరకు ఎలా ఎదుర్కుంటుందనే దానిపై రాసిన ఈ పాట, ఇప్పుడు బుల్లితెరను షేక్ చేస్తోంది. రేవంత్ ఇప్పటి వరకు 200 పాటలు పాడారు. పలు సినిమాల్లో తానేమిటో నిరూపించుకున్న ఈ వర్ధమాన గాయకుడు, మరింతగా తన గాత్రంతో అలరించాలని కోరుకుందాం.
No comment allowed please