Varun Gandhi : భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి మోదీ సర్కార్ ను నిలదీశారు. ఒక రకంగా కడిగి పారేశారు. ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ వస్తున్నారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా ఆర్థిక నేరగాళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అహ్మదాబాద్ కు చెందిన ఏబీజీ షిప్ యార్డు కంపెనీ మాజీ చైర్మన్ రిషి అగర్వాల్ ఏకంగా రూ. 22, 854 కోట్లకు పైగా భారీ మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది.
ఈ మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈడీ విచారిస్తోంది. 28 బ్యాంకులకు టోకరా పెట్టాడు. మరో వైపు ఇప్పటికే ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో ఉంటున్న వారిని ఎందుకు ఇండియాకు తీసుకు రావడం లేదంటూ వరుణ్ గాంధీ(Varun Gandhi )ప్రశ్నించారు.
ప్రజా ధనాన్ని లూటీ చేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బలమైన ప్రభుత్వం దేశంలో ఉంది. అంతకంటే ఎక్కువగా చర్య తీసుకుంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
పరారీలో ఉన్న వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లు రూ. 9,000 కోట్లు, రూ. 14 వేల కోట్ల భారీ బ్యాంకు మోసాలకు పాల్పడ్డారు. వీటిని విచారించాక వారు దేశం విడిచి పోయారంటూ ఆరోపించారు.
రిషి అగర్వాల్ వారి కంటే ఎక్కువగా కొల్లగొట్టాడు. ఇతడిని కూడా విచారించి వదిలేస్తారా అని నిలదీశారు.
అప్పుల ఊబిలో కూరుకు పోయిన దేశంలో రోజుకు 14 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ తరుణంలో కొందరు మాత్రం సుఖ సంతోషాలతో జీవిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు వరుణ్ గాంధీ.
Also Read : పేలుళ్ల కేసులో 38 మందికి ఉరి శిక్ష