Chinnajeeyar Swamy : సీఎం కేసీఆర్ తో విభేదాలు లేవు
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి
Chinnajeeyar Swamy : జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి (Chinnajeeyar Swamy)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో మీడియాతో మాట్లాడారు చిన్న జీయర్ స్వామి.
ఈనెల 2 నుంచి 14 వరకు కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిశాయి. అయితే చివరగా జరపాల్సిన శాంతి కళ్యాణం ను ఈనెల 19కి వాయిదా వేశారు.
దీనికి ప్రధాన కారణంగా గతంలో అన్నీ తానై వ్యవహరించిన, అపర భక్తుడిగా పేరొందిన సీఎం కేసీఆర్ హాజరు కాక పోవడం. కార్యక్రమం ప్రారంభంలో హాజరయ్యారు సీఎం. ఈ సందర్భంగా తన మనుమడు హిమాంశు రావు ను ఆశీర్వదించారు.
తాత అంతటి నాయకుడు అవుతాడని దీవించారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 5న ప్రధాని వచ్చారు. రూ. 1000 కోట్లతో 216 అడుగుల శ్రీ భగవద్ రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం 13న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వర్ణమూర్తిని ప్రారంభించారు. పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సీఎంలు హాజరయ్యారు. స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
ఒక్క రోజు కనిపించిన సీఎం ఆ తర్వాత పాల్గొనక పోవడంపై స్వామి, సీఎంల మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. దీనిని పూర్తిగా ఖండించారు.
శాంతి కళ్యాణంకు ప్రతి ఒక్కరు రావాలని కోరారు. సీఎం కేసీఆర్ కూడా వస్తున్నారని చెప్పారు చిన్న జీయర్ స్వామి(Chinnajeeyar Swamy). సీఎంతో తమకు విభేదాలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు.
ఆయన సహకారం వల్లనే కార్యక్రమం సక్సెస్ అయ్యిందన్నారు. ప్రతిపక్షం, స్వపక్షం రాజకీయాల్లో ఉంటాయని ఇక్కడ కాదన్నారు.
Also Read : మేడారం సంబురం జన సందోహం