Deepika Padukone : మా ఫ్యామిలీ జీర్ణించు కోవ‌డం లేదు

గెహ్రాయాన్ లో పాత్ర‌పై దీపికా ప‌దుకొనే

Deepika Padukone  : ప్ర‌ముఖ బాలీవుడ్ సినీ న‌టి దీపికా ప‌దుకొనే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన గెహ్రాయ‌న్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 11న విడుద‌లైంది.

ఈ సినిమాపై పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగింది. ఎందుకంటే ఇందులో దీపికా ప‌దుకొనే(Deepika Padukone )రెచ్చి పోయి న‌టించింది. ఒక ర‌కంగా బూతు సినిమా కంటే ఎక్కువ‌గా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ప్ర‌ధానంగా మ‌రో బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా రనౌత్ అయితే ఇది ప‌క్కా పోర్న్ సినిమా అంటూ పేర్కొంది. క‌థా ప‌రంగా పాత్ర‌లో లీన‌మై న‌టించానే త‌ప్పా స్కిన్ షో చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేస్తూ వ‌చ్చింది దీపికా ప‌దుకొనే.

తాజాగా ఆమె ఇంకో బాంబు పేల్చింది. తాను న‌టించిన గెహ్రాయాన్ పాత్ర‌ను త‌మ క‌టుంబం జీర్ణించుకోలేక పోతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

గ‌తంలో తాను న‌టించిన అన్ని సినిమాల‌కు, పాత్ర‌ల‌కు కుటుంబం నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భించింద‌ని చెప్పింది దీపికా ప‌దుకొనే. ఒక ర‌కంగా ఇది జీర్ణించు కోవ‌డం క‌ష్ట‌మేన‌ని అభిప్రాయ ప‌డింది.

ఇదిలా ఉండ‌గా శ‌కున్ బాత్రా గెహ్రాయాన్ లో ముంబ‌యిక‌ర్ అలీషా అనే యువ‌తి పాత్ర‌లో దీపిక న‌టించింది. త‌న బంధువైన కాబోయే భ‌ర్త‌తో ఎఫైర్ పెట్టుకునేందుకు త‌న ప్రియుడిని మోసం చేస్తుంది.

అలీషా కూడా ఈ మూవీలో ఆందోళ‌న స‌మ‌స్యల‌తో బాధ ప‌డుతోంది. గ‌తంలో కూడా బాధాక‌ర‌మైన సంబంధాన్ని క‌లిగి ఉంది. సిద్దాంత్ చ‌తుర్వేది తో పూర్తి ఇంటిమ‌సీతో క‌లిసి న‌టించింది..

Also Read : ‘అర‌బిక్ కుతు’ పాట‌కు స‌మంత డ్యాన్స్

Leave A Reply

Your Email Id will not be published!